పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ విడుదల
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆల్ టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ రోడ్ యూజ్ కోసం ఉద్దేశించి తయారు చేసిన స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ వాహనాన్ని గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ మూడు చక్రాలు, రెండు సీట్లు కలిగిన వాహనం (మూడు చక్రాలు కలిగిన వాహనాన్ని ట్రైక్ అని పిలుస్తారు).
ఇది కూడా చదవండి: భారతదేశంలో ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తయిన రైల్ బ్రిడ్జ్
పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ రెండు వేరియంట్ల (బేస్, ఎస్ఎల్)లో లభిస్తుంది. ఇదొక స్ట్రీట్ లీగల్ వాహనం. అంటే దీనిని సాధారణ రోడ్లపై కూడా నడుపుకోవచ్చన్నమాట. ఈ మూడు చక్రాల వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్‌లో జనరల్ మోటార్స్ నుంచి గ్రహించిన 2.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 173 హార్స్ పవర్‌ల శక్తిని, 225 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్‌ను స్లింగ్‌షాట్ ట్రైక్ ముందు భాగంలో అమర్చారు. ఈ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక ఉన్న చక్రానికి బదిలీ అవుతుంది.

ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ 36 మి.మీ. ఫైనల్ డ్రైవ్ బెల్టును కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. స్లింగ్‌షాట్ మొత్తం బరువు 782 కేజీలు మాత్రమే.

పోలారిస్ తమ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్‌ను ఇప్పుడే విడుదల చేసినప్పటికీ, దీని డెలివరీలు మాత్రం 2015 నుంచి ప్రారంభమవుతాయి.

మనదేశ కరెన్సీలో పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ ధరలు, వేరియంట్లు ఈ విధంగా ఉన్నాయి:
బేస్ వేరియంట్ - రూ.12.02 లక్షలు
ఎస్ఎల్ వేరియంట్ - రూ.14.43 లక్షలు

పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్‌లో త్రీపాయింట్ సీట్‌బెల్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, బకెట్ సీట్స్, ఎల్ఈడి లైట్స్, ఫోర్జ్డ్ అల్యూమినియం వీల్స్, మీడియా కన్సోల్, యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీ, కెమెరా బ్యాకప్ వంటి ఫీచర్లున్నాయి.
వీడియో
పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ డెమో వీడియోని ఈ స్లైడ్‌లో చూడండి.


Click it and Unblock the Notifications








