పోర్షే 911 కరెరా ఎస్ 50వ వార్షికోత్స ఎడిషన్ వస్తోంది

By Ravi

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పోర్షే, తమ సంస్థను స్థాపించి అప్పుడే 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ సంస్థ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, కంపెనీ అందిస్తున్న 911 మోడల్ కారులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోర్షే తమ సంస్థను 1963లో స్థాపించింది. ఈ నేపథ్యంలో తమ 50వ వార్షికోత్స ఎడిషన్ పోర్షే 911 కరెరా ఎస్ కారును కేవలం 1963 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇవి 1963 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. సాధారణంగా కరెరా 4 మోడళ్లలో కనిపించే వెడల్పాటి, డైనమిక్ కార్నరింగ్ లైట్స్, స్పెషల్‌గా ట్యూన్ చేయబడిన పిఏఎస్ఎమ్ సస్పెన్షన్ సిస్టమ్, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ వంటి యాంత్రికపరమైన మార్పులను ఈ స్పెషల్ ఎడిషన్‌లో గమనించవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్‌లో 395 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో జతచేయబడి ఉంటుంది.

పోర్షే 911 కరెరా ఎస్ 50వ వార్షికోత్సవ ఎడిషన్ మ్యాన్యువల్ వేరియంట్ కేవలం 4.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని మరియు ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. మ్యాన్యువల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. ఆటోమేటిక్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 297 కిలోమీటర్లు. 20-ఇంచ్ ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ బ్యాడ్జ్‌లు, విభిన్న వింగ్ మిర్రర్స్, డ్యూయెల్ కలర్ ఆప్షన్‌లు ఈ మోడల్ సొంతం.

పోర్షే 911 కరెరా ఎస్

పోర్షే 911 కరెరా ఎస్

50వ వార్షికోత్స ఎడిషన్

50వ వార్షికోత్స ఎడిషన్

ఫ్రంట్ ప్రొఫైల్

ఫ్రంట్ ప్రొఫైల్

రియర్ వ్యూ

రియర్ వ్యూ

ఇంటీరియర్ వ్యూ

ఇంటీరియర్ వ్యూ

మీటర్ కన్సోల్

మీటర్ కన్సోల్

5-స్పోక్ అల్లాయ్ వీల్స్

5-స్పోక్ అల్లాయ్ వీల్స్

సీట్స్

సీట్స్

స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్

స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్

మీటర్ కన్సోల్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్

మీటర్ కన్సోల్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్

హాఫ్ సెంచరీ ఎడిషన్..

హాఫ్ సెంచరీ ఎడిషన్..

పోర్షే 911 కరెరా ఎస్ 50

పోర్షే 911 కరెరా ఎస్ 50

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2013, 15:52 [IST]
English summary
The first Porsche 911 sports coupe was revealed to the world in 1963 at the Frankfurt Auto Show. On its Golden Jubilee year Porsche has announced a 50 Years Edition 911 Carrera S to mark the occasion.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+