పోర్షే 911 టార్గా విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే, తాజాగా భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. 'పోర్షే 911 టార్గా' (Porsche 911 Targa) పేరుతో ఈ కొత్త కారును ప్రవేశపెట్టారు. ఇదొక ఓపెన్-టాప్ కారు. దేశీయ విపణిలో ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది అవి - టార్గా 4, టార్గా 4ఎస్. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి.

పోర్షే 911 టార్గా ధరలు:

  • పోర్షే 911 టార్గా 4 - రూ.1.59 కోట్లు
  • పోర్షే 911 టార్గా 4ఎస్ - రూ.1.78 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Porsche 911 Targa Launched In India

పోర్షే 911 టార్గా 4 స్పెసిఫికేషన్లు:
పోర్షే 911 టార్గా 4 వేరియంట్లో 3.4 లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 350 బిహెచ్‌పిల శక్తిని, 390 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పిడికె)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 282 కిలోమీటర్లు.
Porsche 911 Targa

పోర్షే 911 టార్గా 4ఎస్ వేరియంట్లో 3.8 లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 400 బిహెచ్‌పిల శక్తిని, 440 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పిడికె)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 296 కిలోమీటర్లు.

పోర్షే 911 టార్గా మోడల్ కంపెనీ ఆప్షనల్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. కస్టమర్లు స్పోర్ట్ క్రోనో, కరెరా ఎస్ పవర్‌కిట్ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో ఈ కారును తయారు చేశారు. ఇందులో అన్ని రకాల సేఫ్టీ, కంఫర్ట్, కన్వీనెసన్స్ ఫీచర్లు ఉన్నాయి.

911 Targa

More from DriveSpark

Article Published On: Thursday, February 5, 2015, 9:06 [IST]
English summary
German luxury car manufacturer Porsche offers a few of its high-end products in India. Now the manufacturer has opted to launch its 911 Targa in India, it is currently on offer in several developed markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+