పోర్షే కయీన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కయీన్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 పోర్షే కయీన్ ఎస్‌యూవీలో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులతో పాటుగా మెకానికల్ మార్పులు కూడా ఉన్నాయి. దేశీయ విపణిలో కొత్త పోర్షే కయీన్ వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- కయీన్ డీజిల్ - రూ.1.04 కోట్లు
- కయీన్ ఎస్ - రూ.1.18 కోట్లు
- కయీన్ ఎస్ డీజిల్ - రూ.1.21 కోట్లు
- కయీన్ టర్బో - రూ.1.78 కోట్లు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పోర్షే కయీన్ ఫేస్‌లిఫ్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

పోర్షే కయీన్ పెట్రోల్ ఇంజన్
పోర్షే కయీన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కయీన్ ఎస్‌లో 3.6 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 414 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కయీన్ టర్బో వేరియంట్లో 4.8 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 513 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే కయీన్ డీజిల్ ఇంజన్
ఇకపోతే పోర్షే కయీన్ డీజిల్ వేరియంట్లో 3.0 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 241 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కయీన్ ఎస్ డీజిల్ వేరియంట్లో 4.2 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 380 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే కయీన్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు:
బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్
ఆటోమేటిక్ బూట్ లిడ్
ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
పానోరమిక్ సన్‌రూఫ్
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కోసం ప్యాడల్ షిఫ్టర్స్
పోర్షే ఎయిర్ సస్పెన్షన్
స్పోర్ట్ ప్లస్ డ్రైవింగ్ మోడ్
బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
పార్క్ అసిస్ట్
సీట్ హీటింగ్

పోర్షే కయీన్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు:
పోర్షే స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (పిఎస్ఎమ్)
పోర్షే డైనమిక్ లైట్ సిస్టమ్ (పిడిఎల్ఎస్)
డేటైమ్ రన్నింగ్ లైట్స్
లేన్ డిపార్చర్ వార్నింగ్
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ పోర్షే యాక్టివ్ సేఫ్ (పిఏఎస్)
పోర్షే డైనమిక్ షాషీ కంట్రోల్ (పిడిసిసి)
వీల్స్ అండ్ టైర్ ప్రెజర్ మోనిటరింగ్ (టిపిఎమ్ఎస్)
పోర్షే ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ (పిటిఎమ్)


Click it and Unblock the Notifications








