కేమ్యాన్ ఎస్ స్పోర్ట్స్ కారును విడుదల చేసిన పోర్షే ఇండియా
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే ఇండియా, భారత మార్కెట్లో మరొక సరికొత్త కారును విడుదల చేసింది. పోర్షే కేమ్యాన్ ఎస్ మోడల్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. ఇక్కడి మార్కెట్లో దీని ధర రూ.93.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని పోర్షే విక్రయించనుంది.
పోర్షే కేమ్యాన్ ఎస్ స్పోర్ట్స్ కారులో 3.4 లీటర్, ఫ్లాట్-సిక్స్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 329 పిఎస్‌ల శక్తిని, 370 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు సెవన్ స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. ఇది కేవలం 4.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్టం వేగం గంటకు 281 కిలోమీటర్లు.
పోర్షే మిక్స్డ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ కొత్త కేమ్యాన్ ఎస్ కారు లైట్‌వెయిట్ డిజైన్‌ను కలిగి ఉండి, పొడవాటి వీల్‌బేస్‌ను, వెడల్పాటి ట్రాక్‌ను కలిగి ఉంటుంది. రియర్ వీల్ డ్రైవ్ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ డైనమిక్స్‌ను మరింత మెరుగుపరచేందుకు దీని వీల్‌బేస్‌ను పొడవుగా ఉంచారు. ఈ కారులో స్పోర్ట్స్ మోడ్ కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది.
పాత వెర్షన్ కేమ్యాన్ ఎస్‌తో పోల్చుకుంటే ఈ కొత్త కేమ్యాన్ ఎస్ బేసిక్ డిజైన్ దాదాపు ఒకేరకంగా ఉంటుంది. ఫ్రంట్ బంపర్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, మూలలకు మార్చిన ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్స్‌తో కూడిన హెడ్‌లైట్స్, సన్నటి రియర్ స్పాయిలర్, కొత్త టెయిల్ లైట్స్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్డ్ ఇంటీరియర్స్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు.































Click it and Unblock the Notifications








