జూన్ నెలలో విడుదల కానున్న పోర్షే మకన్ ఎస్‌యూవీ!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్షే అందిస్తున్న అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మకన్' (Macan) ఎస్‌యూవీ గుర్తుందా? ఈ లగ్జరీ ఎస్‌యూవీ 2014లో భారత్‌లో విడుదల కానున్నట్లు గడచిన సంవత్సరం నవంబర్ నెలలో మేము ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ పోర్షే తమ మకన్ ఎస్‌యూవీని ఈ ఏడాది జూన్ నెలలో ఇక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ తొలిసారిగా గడచిన సంవత్సరంలో జరిగిన లాస్ ఏంజిల్స్ ఆటో షోలో కంపెనీ విడుదల చేసింది. ఇది పోర్షే నుంచి అత్యంత సరసమైన ధరకే లభ్యం కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది పోర్షే కయూన్‌కు కాంపాక్ట్ వెర్షన్‌గా అనిపిస్తుంది.

ఇందులో మకన్ ఎస్, మకన్ టర్బో వేరియంట్లు వి6 పెట్రోల్ ఇంజన్లతో లభిస్తాయి. ఇందులో ఓ శక్తివంతమైన 254 హెచ్‌పి, 3.0 లీటర్ టర్బో వి6 డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. అమెరికన్ మార్కెట్ కోసమే కాకుండా భారత్ వంటి మార్కెట్ల కోసం ఈ ఇంజన్ అందుబాటులో ఉండనుంది. సిబియూ రూట్లో ఈ మోడల్‌ను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఆడి క్యూ5 ప్లాట్‌ఫామ్‌

ఆడి క్యూ5 ప్లాట్‌ఫామ్‌

ఆడి క్యూ5 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని పోర్షే మకన్ ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. అయితే, ఆడి క్యూ5తో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది.

ఇంజన్

ఇంజన్

పోర్షే మకన్ ఎస్ వేరియంట్లో 340 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.0 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. పోర్షే మకన్ టర్బో వేరియంట్లో 400 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.6 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఈ రెండు ఇంజన్లు కూడా 7-స్పీడ్ పిడికె డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో నుసంధానం చేయబడి ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇందులో ఇతర ఎలక్ట్రానిక్ సాంకేతికతలతో పాటుగా పోర్షే ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా ఉంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

మకన్ ఎస్ వేరియంట్ 5.2 సెకండ్ల వ్యవధిలో 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఇదే వేగాన్ని టర్బో వేరియంట్ కేవలం 4.6 సెకండ్ల వ్యవధిలోనే చేరుకుంటుంది. ఆప్షనల్ స్పోర్ట్ క్రోనో ప్యాకేజ్ జోడించుకున్నట్లయితే, ఈ సమయం వరుసగా 5.0 సెకండ్లు, 4.4 సెకండ్లకు తగ్గుతుంది.

టాప్ స్పీడ్

టాప్ స్పీడ్

పోర్షే మకన్ ఎస్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 265.5 కిలోమీటర్లు. పోర్షే మకన్ టర్బో వేరియంట్ గరిష్ట వేగం గంటకు 264 కిలోమీటర్లు.

స్పోర్ట్స్ మోడ్

స్పోర్ట్స్ మోడ్

అన్ని మకన్ ఎస్‌యూవీలు స్పోర్ట్ బటన్‌తో లభిస్తాయి. ఈ బటన్ వలన స్టీరింగ్ మరింత రెస్పాన్సివ్‌గా, సస్పెన్షన్ మరింత స్టిఫ్‌గా, ఇంజన్ పెర్ఫామెన్స్ మరింత మెరుగ్గా ఉండి స్పోర్టీ డ్రైవ్‌ను ఆఫర్ చేస్తుంది.

బెస్ట్ ఆఫ్ రోడర్

బెస్ట్ ఆఫ్ రోడర్

ఆఫ్ రోడింగ్ కోసం ఒక్క బటన్‌ను ప్రెస్ చేయగానే, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రతి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ రోడింగ్ డ్రైవ్‌కు అనుగుణంగా మారిపోతుంది. అంతేకాకుండా, ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 1.58 ఇంచ్‌ల నుంచి 9.06 ఇంచ్‌లకు పెరుగుతుంది. అయితే, ఇది కేవలం గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దిగువన ఉన్నప్పుడే పనిచేస్తుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

పోర్షే మకన్ ఇంటీరియర్స్ ఇతర పోర్షే వాహనాల ఇంటీరియర్స్‌ను పోలి ఉంటాయి. ఉదాహరణకు, సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్ 918 స్పైడర్ మోడల్‌లోని సెంటర్ కన్సోల్‌ను తలపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, బోస్ లేదా బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, హార్డ్ డ్రైవ్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ మొదలైన అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

ఇండియా లాంచ్

ఇండియా లాంచ్

పోర్షే మకన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ ఏడాది జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల కానుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.50 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా. లేటెస్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, April 18, 2014, 12:39 [IST]
English summary
Porsche will be introducing their luxury SUV, the Macan in India. The younger sibling to the larger Cayenne, the Macan will be launched in June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+