భారత్‌కు రానున్న పోర్షే 911 50వ వార్షికోత్స ఎడిషన్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే, తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ అందిస్తున్న 911 మోడల్ కారులో ఓ 50వ వార్షికోత్స ఎడిషన్ పోర్షే 911 కరెరా ఎస్ మోడల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి రానుంది. అయితే, ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ బ్యూటీ సొంతమవుతుంది. రానున్న సెప్టెంబర్ నెలలో ఈ స్పెషల్ ఎడిషన్ కారు దేశీయ విపణిలో విడుదల కానున్నట్లు సమాచారం.
పోర్షే తమ సంస్థను 1963లో స్థాపించింది. ఈ నేపథ్యంలో తమ 50వ వార్షికోత్స ఎడిషన్ పోర్షే 911 కరెరా ఎస్ కారును కూడా కేవలం 1963 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఈ కారుకు ప్రపచం వ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మీరు ఇలాంటి ఓ కారును సొంతం చేసుకోవాలనుకుంటే, వెంటనే మీ సమీపంలో పోర్షే అధీకృత డీలరు వద్దకు వెళ్లి ఈ కారును బుక్ చేసుకోండి. సెప్టెంబర్ నెలలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షో (ఐఏఏ)లో కంపెనీ ఈ కారును విడుదల చేయనుంది.







ప్రపంచ వ్యాప్తంగా ఇవి 1963 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. సాధారణంగా కరెరా 4 మోడళ్లలో కనిపించే వెడల్పాటి, డైనమిక్ కార్నరింగ్ లైట్స్, స్పెషల్‌గా ట్యూన్ చేయబడిన పిఏఎస్ఎమ్ సస్పెన్షన్ సిస్టమ్, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ వంటి యాంత్రికపరమైన మార్పులను ఈ స్పెషల్ ఎడిషన్‌లో గమనించవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్‌లో 395 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో జతచేయబడి ఉంటుంది.
పోర్షే 911 కరెరా ఎస్ 50వ వార్షికోత్సవ ఎడిషన్ మ్యాన్యువల్ వేరియంట్ కేవలం 4.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని మరియు ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. మ్యాన్యువల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. ఆటోమేటిక్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 297 కిలోమీటర్లు. 20-ఇంచ్ ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ బ్యాడ్జ్‌లు, విభిన్న వింగ్ మిర్రర్స్, డ్యూయెల్ కలర్ ఆప్షన్‌లు ఈ మోడల్ సొంతం.


Click it and Unblock the Notifications








