మరింత శక్తివంతమైన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ-క్లాస్ కారులో మరింత శక్తివంతమైన వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్‌లో ప్రస్తుతం లభిస్తున్న వాటి కన్నా మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజన్‌ను కంపెనీ పరిచయం చేసింది.
మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 200 సిడిఐ స్పోర్ట్ ఇప్పుడు మరింత పవర్‌ను, పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులోని 2143సీసీ, 4-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 136 హెచ్‌పిల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‍బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ 200 సిడిఐ స్పోర్ట్ ధర:
- ఏ-క్లాస్ ఏ 200 సిడిఐ స్పోర్ట్ - రూ.25.95 లక్షలు
(ఎక్స్-షోరూమ్, ముంబై)
మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఫీచర్లు:
- లైట్ అల్లాయ్ వీల్స్
- సీట్ కంఫర్ట్ ప్యాకేజ్
- ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ లంబార్ సపోర్ట్
- స్పోర్ట్ సీట్స్ విత్ ఆర్టికో మెస్సాన్సీ ఫ్యాబ్రిక్
- ఇండియా స్పెసిఫిక్ సస్పెన్షన్
- ఎన్‌హాన్స్డ్ రైడ్ క్వాలిటీ
- పానరోమిక్ సన్‌రూఫ్

- 7 ఎయిర్‌బ్యాగ్స్
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్


Click it and Unblock the Notifications








