నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ప్రారంభం
జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ తాజాగా భారత మార్కెట్లో ఆవిష్కరించిన 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano) కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం అధికారికంగా సెప్టెంబర్ 1, 2013వ తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. కంపెనీ ప్రకటించినట్లుగానే నేటి నుంచి ఈ స్టయిలిష్ ఎస్‌యూవీ కోసం కంపెనీ డీలర్లు అధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.
ఈ స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అందరికన్నా ముందు సొంతం చేసుకోవాలనుకునే వారు త్వరగా నిస్సాన్ డీలర్ల వద్దకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా నిస్సాన్ టెర్రానోను బుక్ చేసుకోవచ్చు (ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవటం కోసం http://www.nissanterrano.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రెనో డస్టర్ కన్నా మెరుగైన లుక్, ఇంటీరియర్ ఫీచర్లు కలిగిన నిస్సాన్ టెర్రానో డెలివరీలు అక్టోబర్ నెల ఆరంభం నుంచి ప్రారంభం కానున్నాయి. రెనో డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెర్రానో కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, పెట్రోల్ వెర్షన్ టెర్రానో కేవలం ఎక్స్ఎల్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది డస్టర్ మాదిరిగానే 85 పిఎస్ ఇంజన్, 110 పిఎస్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. డీజిల్ 85 పిఎస్ ఇంజన్ కలిగిన టెర్రానో ఎక్స్ఈ, ఎక్స్ఎల్-డి, ఎక్స్ఎల్-డి ప్లస్ అనే వేరియంట్లలోను, డీజిల్ 110 పిఎస్ ఇంజన్ కలిగిన టెర్రానో ఎక్స్ఎల్-డిస ఎక్స్‌వి-డి, ఎక్స్‌వి-డి ప్రీమియం అనే వేరియంట్లలో లభ్యం కానున్నట్లు సమాచారం. మొత్తమ్మీద చూసుకుంటే, నిస్సాన్ ఇండియా పెట్రోల్ వెర్షన్ టెర్రానో కన్నా డీజిల్ వెర్షన్ టెర్రానోకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








