రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబిని ఆవిష్కరించిన ప్రియాంకా చోప్రా
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీ తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ అందిస్తున్న 'రేంజ్ రేవర్'లో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. పొడవాటి వీల్‌బేస్ కలిగిన 'రేంజ్ రోవర్ ఎల్' వేరియంట్‌ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా చేతుల మీదుగా కంపెనీ ఆవిష్కరింపజేసింది.
భారత మార్కెట్లో విడుదలైన రేంజ్ రోవర్ ఎల్ మోడల్ మూడు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అవి - వోగ్ వేరియంట్లో ఉపయోగించిన 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 248 పిఎస్‌ల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ డీజిల్ వేరింట్లలో (వోగ్ ఎస్ఈ, ఆటోబయోగ్రఫీ) 4.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 339 పిఎస్‌ల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇకపోతే మూడవ ఇంజన్ ఆప్షన్‌గా.. పెట్రోల్ వెర్షన్ (ఆటోబయోగ్రఫీ వేరియంట్లో) 5.0 లీటర్ సూపర్‌చార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 510 పిఎస్‌ల శక్తిని, 625 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెగ్యులర్ రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే, ఈ లాంగర్ వీల్‌బేస్ కలిగిన రేంజ్ రోవర్ ఎల్ మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది.

పొడవాటి వీల్‌బేస్ కలిగిన 'రేంజ్ రోవర్ ఎల్' వేరియంట్‌ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా చేతుల మీదుగా కంపెనీ ఆవిష్కరింపజేసింది.

భారత మార్కెట్లో విడుదలైన రేంజ్ రోవర్ ఎల్ మోడల్ మూడు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

వోగ్ వేరియంట్లో ఉపయోగించిన 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 248 పిఎస్‌ల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాప్-ఎండ్ డీజిల్ వేరింట్లలో (వోగ్ ఎస్ఈ, ఆటోబయోగ్రఫీ) 4.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 339 పిఎస్‌ల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే మూడవ ఇంజన్ ఆప్షన్‌గా.. పెట్రోల్ వెర్షన్ (ఆటోబయోగ్రఫీ వేరియంట్లో) 5.0 లీటర్ సూపర్‌చార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 510 పిఎస్‌ల శక్తిని, 625 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








