ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు కోసం బుకింగ్స్ ఓపెన్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ 'ప్రోఫ్యూజన్ ఎగ్జోటిక్ కార్స్' నుంచి 'ప్రోఫ్యూజన్ టైఫూన్' (Profusion Typhoon) అనే ఓ సరికొత్త ఓపెన్ వీల్ సింగిల్ సీటర్ స్పోర్ట్స్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కారును దేశీయ విపణిలో విడుదల చేయటానికి ముందుగానే కంపెనీ ప్రీ-బుకింగ్‍లను ప్రారంభించింది.
ప్రోఫ్యూజన్ తమ స్పోర్ట్స్ కార్లను ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా పూర్తిగా చేతులతో తయారు చేస్తుంది. ప్రోఫ్యూజన్ టైఫూన్ ఓపెన్ వీల్ సింగిల్ సీటర్ స్పోర్ట్స్ కారు చూడటానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో 145 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారు మొత్త బరువు 630 కేజీలు మాత్రమే. ఇది కేవలం 4.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ కార్లను చేతులతో తయారు చేస్తారు కాబట్టి, కొనుగోలుదారులకు అనేక రకాల కస్టమైజేషన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. సీట్ కలర్, బ్రేక్ కాలిపర్ కలర్, బ్రేక్ డిస్క్ ప్యాటర్న్, రియర్ వింగ్ కలర్, వీల్ ఆర్చ్ షేప్, విభిన్న స్టీరింగ్స్‌లను వినియోగదారులకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పుష్ బటన్ స్టార్ట్ ఆప్షన్ అలాగే కారు కలర్ సరిపోయే హెల్మెట్‌లను పొందవచ్చు.
బ్రిటీష్ మార్కెట్లో ఈ కారు ధర 29,000 పౌండ్లు (సుమారు రూ.23.5 లక్షలు). అయితే, తాజాగా విడుదలైన బడ్జెట్‌లో భారత సర్కారు ఇంపోర్టెడ్ కార్లపై దిగుమతి సుంకాన్ని 100 శాతానికి పెంచడంతో మన దేశంలో ఈ కారు ధర రూ.55 లక్షలను దాటిపోవచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు బుకింగ్‌ల కోసం http://www.profusion-exotic-cars.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ 'ప్రోఫ్యూజన్ ఎగ్జోటిక్ కార్స్' నుంచి 'ప్రోఫ్యూజన్ టైఫూన్' (Profusion Typhoon) అనే ఓ సరికొత్త ఓపెన్ వీల్ సింగిల్ సీటర్ స్పోర్ట్స్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు
ఈ కారును దేశీయ విపణిలో విడుదల చేయటానికి ముందుగానే కంపెనీ ప్రీ-బుకింగ్‍లను ప్రారంభించింది.

ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు
ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారులో 145 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారు మొత్త బరువు 630 కేజీలు మాత్రమే. ఇది కేవలం 4.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు
సీట్ కలర్, బ్రేక్ కాలిపర్ కలర్, బ్రేక్ డిస్క్ ప్యాటర్న్, రియర్ వింగ్ కలర్, వీల్ ఆర్చ్ షేప్, విభిన్న స్టీరింగ్స్‌లను వినియోగదారులకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పుష్ బటన్ స్టార్ట్ ఆప్షన్ అలాగే కారు కలర్ సరిపోయే హెల్మెట్‌లను పొందవచ్చు.

ప్రొఫ్యూజన్ టైఫూన్ స్పోర్ట్స్ కారు
బ్రిటీష్ మార్కెట్లో ఈ కారు ధర 29,000 పౌండ్లు (సుమారు రూ.23.5 లక్షలు). అయితే, తాజాగా విడుదలైన బడ్జెట్‌లో భారత సర్కారు ఇంపోర్టెడ్ కార్లపై దిగుమతి సుంకాన్ని 100 శాతానికి పెంచడంతో మన దేశంలో ఈ కారు ధర రూ.55 లక్షలను దాటిపోవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








