ఉత్పత్తి దశకు చేరుకోనున్న రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

By Ravi

రేంజ్ రోవర్ ఎవోక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) నుంచి అతికొద్ది సమయంలో అత్యంత ఘన విజయం సాధించిన ఈ లగ్జరీ ఎస్‍‌‌యూవీ త్వరలోనే కన్వర్టిబల్ (క్యాబ్రియో) రూపంలో దర్శనమివ్వబోతోంది.

గడచిన 2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో జేఎల్ఆర్ ప్రదర్శించిన రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ కాన్సెప్ట్‌ను ఉత్పత్తి దశకు తీసుకెళ్లాలని కంపెనీ యోచిస్తోంది. ప్రపంచంలో కెల్లా తొలి కన్వర్టబిల్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)గా ఖ్యాతి దక్కించుకున్న ఈ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టబిల్/క్యాబ్రియో ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి దశకు చేరుకోనుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

చాలా వరకు కాన్సెప్ట్ వాహనాలు కాన్సెప్ట్ దశలోనే మిగిలిపోతుంటాయి. అయితే రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ కాన్సెప్ట్ మాత్రం ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ఈ మోడల్‌కు లభించిన అశేష స్పందనను దృష్టిలో ఉంచుకొని దీనిని ఉత్పత్తి దశకు తీసుకెళ్లనున్నారు.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

ఈ కారులో మెకానికల్ సాఫ్ట్ రూఫ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డులో ఉండే ఓ బటన్‌ను ప్రెస్ చేయగాన్ టాప్ తొలగిపోయి వెనక బూట్ స్పేస్‌లోకి మడుచుకుంటుంది. తిరిగి అదే బటన్‌ను ప్రెస్ చేయగాని రూఫ్ యధా స్థానంలోకి వచ్చి చేరుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

కన్వర్టబిల్ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీలో యాంత్రికంగా నియంత్రించబడే ఈ రూఫ్ బరువు సుమారు 80 కిలోలు ఉంటుంది. ఈ బరువు స్టాండర్డ్ 3-డోర్ ఎవోక్‌లో ఉపయోగించే రూఫ్ కన్నా అధికం.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కావచ్చని అంచనా. డీజిల్ వెర్షన్‌లో 2179సీసీ, టర్బోడీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పిల శక్తిని, 420 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్

పెట్రోల్ వెర్షన్‌లో 1999సీసీ, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 237 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
Range Rover is a premium luxury SUV brand and they provide excellent products all over the world. Their most popular offering till date has been their modern SUV the Evoque. It looks sharp and nothing like its predecessors.
Story first published: Thursday, January 8, 2015, 14:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X