రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్ విడుదల ఖరారు!

By Ravi

బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీ మేకర్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న పాపులర్ ఎస్‍యూవీ రేంజ్ రోవర్ ఎవోక్‌లో ఓ కన్వర్టిబల్ వెర్షన్ రానున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ కన్వర్టిబల్ వెర్షన్ రేంజ్ రోవర్ ఎవోక్ విడుదలను ఖరారు చేసింది. వచ్చే ఏడాదిలో ఈ మోడల్‍‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తమ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2012లో జరిగిన జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. ఈ కారులో మెకానికల్ సాఫ్ట్ రూఫ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డులో ఉండే ఓ బటన్‌ను ప్రెస్ చేయగాన్ టాప్ తొలగిపోయి వెనక బూట్ స్పేస్‌లోకి మడుచుకుంటుంది. తిరిగి అదే బటన్‌ను ప్రెస్ చేయగాని రూఫ్ యధా స్థానంలోకి వచ్చి చేరుతుంది.

range rover convertible launching soon

కన్వర్టబిల్ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీలో యాంత్రికంగా నియంత్రించబడే ఈ రూఫ్ బరువు సుమారు 80 కిలోలు ఉంటుంది. ఈ బరువు స్టాండర్డ్ 3-డోర్ ఎవోక్‌లో ఉపయోగించే రూఫ్ కన్నా అధికం.రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కావచ్చని అంచనా.

డీజిల్ వెర్షన్‌లో 2179సీసీ, టర్బోడీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పిల శక్తిని, 420 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

range rover new product launch

పెట్రోల్ వెర్షన్‌లో 1999సీసీ, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 237 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
Range Rover confirmed that it will launch the Range Rover Evoque Convertible in 2016. This was one of the worst kept secrets of the company.
Story first published: Tuesday, March 3, 2015, 10:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X