రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; 2016లో విడుదల!
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న పాపులర్ 'రేంజ్ రోవర్ ఎవోక్' మోడల్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. వచ్చే నెలలో జరగనున్న 2015 జెనీవా అంతర్జాతీయ ఆటో షోలో ల్యాండ్ రోవర్ తమ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను ప్రదర్శనకు ఉంచనుంది.
ఈ నేపథ్యంలో, రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ అఫీషియల్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. మోడ్రన్ స్టయిలింగ్, లేటెస్ట్ టెక్నాలజీ, అప్‌గ్రేడెడ్ ఇంజన్స్‌తో ఈ కొత్త మోడల్‌ను డిజైన్ చేశారు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లలో కూడా ప్రధాన మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ముందుగా ఇది ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

అడాప్టివ్ ఆల్-ఎల్ఈడి లైటింగ్‌తో కూడిన సరికొత్త హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్డ్ డేటైమ్ లైట్స్, రివైజ్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్డ్ బంపర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందు గమనించవచ్చు.

ముందు వైపు కొత్త గ్రిల్ డిజైన్స్‌తో కూడిన బంపర్ (ఎంచుకునే మోడల్‌ను బట్టి గ్రిల్ డిజైన్ మారుతూ ఉంటుంది), ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్‌కు దిగువన ఏర్పాటు చేసిన పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ వంటి మార్పులను ప్రధానంగా గమనించవచ్చు.

లోపలి వైపు గమనిస్తే.. రీడిజైన్డ్ సీట్స్, డోర్ ప్యానెల్స్, ఇంప్రూవ్డ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వంటి మార్పులు చూడొచ్చు. ఎకోక్ పాపులర్ డిజైన్‌ను మార్చకుండా, స్టయిలింగ్ చేంజెస్ చేయటం సవాళ్లతో కూడుకున్నదని ల్యాండ్ రోవర్ డిజైన్ బాస్ గేరీ మెక్‌గవర్న్ తెలిపారు.

ఈ రిఫ్రెష్డ్ రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌లో కొత్త జాగ్వార్ ల్యాండ్ రోవర్ 'ఇంగెనియం' డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఇందులో ప్రస్తు ఎస్ఐ4 పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా మరో రెండు పెంట్రోల్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఈ కొత్త ఇంగెనియం డీజిల్ ఇంజన్లు ఇదివరకటి తరం ఇంజన్ల కన్నా 20-30 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటాయి. ఫలితంగా ఎక్కువ మైలేజీనిస్తాయి. అంతేకాకుండా.. ఇవి అతి తక్కువ కర్భన ఉద్ఘారాలను మాత్రమే విడుదల చేస్తాయని కంపెనీ తెలిపింది.

కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కారులో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది ఇన్‌టచ్ కంట్రోల్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త టిఎఫ్‌టి డిస్‌ప్లే కూడా ఉంటుంది.

కొన్ని మోడళ్లలో ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. అలాగే, లేన్-కీపింగ్ అసిస్ట్, అటానమస్ ఎమెర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ ఫెటిగ్ డిటెక్షన్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








