9-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 2014 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల
జర్మనీకు చెందిన ప్రముఖ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ల తయారీ సంస్థ 'జెడ్ఎఫ్ ఫ్రీడ్‌రిచ్‌షాఫెన్' అభివృద్ధి చేసిన తొమ్మిది గేర్లు కలిగిన గేర్‌బాక్స్ (9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్)తో కూడిన ప్రొడక్షన్ వెర్షన్ '2014 రేంజ్ రోవర్ ఎవోక్'ను బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ ఆవిష్కరించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా మోటార్ షోలో ల్యాండ్ రోవర్ ఈ 9-స్పీడ్ ట్రాన్సిమిషన్ కలిగిన ఎవోక్‌ను కాన్సెప్ట్‌గగా ప్రదర్శనకు ఉంచింది.
యూరప్ మార్కెట్లలో వచ్చే ఏడాది ఆరంభంలో ఈ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన 2014 రేంజ్ రోవర్ ఎవోక్ వాణిజ్య పరంగా లభ్యం కానుంది. ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసే ఆస్కారం ఉంది.
నైన్-స్పీడ్ ట్రాన్సిమిషన్ వలన ప్రధానంగా వాహన మైలేజ్ పెరుగుతుంది. అంతేకాకుండా, వాహనం నుండి వెలువడే కర్భన వ్యర్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఈ కొత్త ట్రాన్సిమిషన్‌ను 2014 ఎవోక్ మోడళ్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్లకు జతచేయనున్నారు. 2014లో ఈ నెక్స్ట్ జనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫ్యూయెల్ ఎకానమీ, ఎమిషన్స్
9-స్పీడ్ ట్రాన్సిమిషన్ జోడించిన ఈ కొత్త రేంజ్ రోవక్ ఎవోక్ 11.4 శాతం ఎక్కువ మైలేజీని, 9.5 శాతం తక్కువ కర్భన కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని ల్యాండ్ రోవర్ పేర్కొంది. ఇందులో 148 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ సగటున లీటరుకు 24.48 కి.మీ. మైలేజీని, కిలోమీటరుకు 129 గ్రాముల కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుంది.

యాక్టివ్ డ్రైవ్‌లైన్
ఇదొక ఆప్షనల్ ఫీచర్. ఈ ఫీచర్ వలన ఆల్-వీల్ డ్రైవ్, ఫ్రంట్-వీల్ డ్రైవ్‌లకు మధ్య ఆటోమేటిక్‌గా స్విచ్ చేసుకునే వీలుంటుంది. గంటకు గరిష్టంగా 35 కి.మీ. లేదా అంత కన్నా ఎక్కువగా నిర్ధిష్ట వేగంతో నడుపుతున్నప్పుడు ఫ్రంట్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ అవుతుంది. డ్రైవింగ్ కండిషన్ మారినప్పుడు, కేవలం 300 మిల్లీ సెకండ్ల వ్యవధిలోనే యాక్టివ్ డ్రైవ్ సిస్టమ్ పనిచేసి ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.

యాక్టివ్ టార్క్ బయాసింగ్
యాక్టివ్ డ్రైవ్‌లైన్ ఫీచర్‌లో భాగంగానే, యాక్టివ్ టార్క్ బయాసింగ్ కూడా రోడ్డుపై మంచి గ్రిప్ కోసం టార్క్‌ను వెనుక చక్రాలకు యాంత్రికంగా పంపిణీ చేస్తుంది.

టార్క్ వెక్టరింగ్
ఇది స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే ఓ ప్రత్యేక ఫీచర్. ఇది బ్రేక్ ఫోర్స్‌ను నాలుగు చక్రాలకు పంపిణీ చేసేందుకు సహకరిస్తుంది, ఫలితంగా అండర్‌స్టీరింగ్, ఓవర్‌స్టీరింగ్‌లను కంట్రోల్‌లో ఉంచుతుంది.

2014 రేంజ్ రోవర్ ఎవోక్‌లో అనేక స్టాండర్డ్, ఆప్షనల్ లగ్జరీ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. దీని డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు (కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్స్ మొదలైనవి) కూడా అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








