రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్‌లలో హైబ్రిడ్ వెర్షన్స్
బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ ఓ వైపు ఆల్ ఎలక్ట్రిక్ డిఫెండర్ ప్రోటోటైప్ సక్సెస్‌ఫుల్ టెస్టింగ్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు రేంజ్ రోవర్ సిరీస్‌లో ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న హైబ్రిడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. రెగ్యులర్ రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలలో ఈ హైబ్రిడ్ వెర్షన్లను ల్యాండ్ రోవర్ పరిచయం చేసింది.
కొత్త హైబ్రిడ్ వాహనాల ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని నిరూపించేందుకు గాను ల్యాండ్ రోవర్, ఈ హైబ్రిడ్ వాహనాలతో 10,000 మైళ్ల దూరం ప్రయాణం చేయనుంది. ఈ ప్రయాణం ఫ్రాన్స్ నుంచి ప్రారంభమై పోలండ్, రష్యా మరియు చైనా దేశాల మీదుగా ప్రయాణించి భారతదేశం చేరుకుంటుంది. ఈ జర్నీ అక్టోబర్ మధ్య భాగంలో ముంబైలోని టాటా మోటార్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ముగుస్తుంది.
ల్యాండ్ రోవర్ ఈ హైబ్రిడ్ మోడళ్లకు ఆర్డర్లను సెప్టెంబర్ 10వ తేది నుంచి స్వీకరించనుంది, డెలివరీలు 2014 ఆరంభంలో ప్రారంభమవుతాయి. ఈ సరికొత్త హైబ్రిడ్ రేంజ్ రోవర్లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్
ఈ రెండు హైబ్రిజ్ రేంజ్ రోవర్ కార్లలో రెగ్యులర్ రేంజ్ రోవర్లలో ఉపయోగించే అదే పాత 3.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. దీనికి అదనంగా ఓ 37 కి.వా. (47 హెచ్‌పి) ఎలక్ట్రిక్ మోటార్‌ను జోడించనున్నారు. ఫలితంగా రేంజ్ రోవర్ హైబ్రిడ్ మోడళ్ల పవర్ 335 హార్స్ పవర్‌కు పెరుగుతుంది.

మైలేజ్, ఎమిషన్స్
2372 కేజీల బరువు ఉండే రేంజ్ రోవర్ స్పోర్ట్ హైబ్రిడ్, 2394 కేజీల బరువు ఉండే రేంజ్ రోవర్ హైబ్రిడ్‌లు, ఇందులో 120 కేజీల హైబ్రిడ్ యూనిట్ చేర్చడం వలన, వాస్తవానికి ఇవి తేలికగా ఉండవు. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇవి రెగ్యులర్ రేంజ్ రోవర్ మోడళ్ల కన్నా తేలికగానే ఉండటం విశేషం. ఈ వాహనాలు లీటరుకు 18.7 కి.మీ. మైలేజీనిస్తాయని, కిలోమీటరుకు 169 గ్రాముల కర్భన వ్యర్థాలను విడుదల చేస్తాయని ల్యాండ్ రోవర్ పేర్కొంది. ఈ మైలేజ్ రెగ్యులర్ వెర్షన్ రేంజ్ రోవర్ల కన్నా 16 శాతం అధికం.

పెర్ఫామెన్స్
జెడ్ఎఫ్ 8-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉండే ఈ ఇంజన్ల నుంచి వెలువడే శక్తి నాలుగు చక్రాలకు (ఫోర్-వీల్ డ్రైవ్) సమానంగా పంపిణీ అవుతుంది. రెగ్యులర్ వెర్షన్ రేంజ్ రోవర్లలో ఉండే ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలే ఈ హైబ్రిడ్ వెర్షన్లలోను ఉంటాయి. రేంజ్ రోవర్ హైబ్రిడ్ 7.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, దీని గరిష్ట వేగం గంటకు 217 కి.మీ. రేంజ్ రోవర్ స్పోర్ట్ హైబ్రిడ్ 6.9 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, దీని గరిష్ట వేగం గంటకు 225 కి.మీ.

ఎలక్ట్రిక్ మోడ్
ఈ హైబ్రిడ్ వాహనాల్లో పూర్తి ఎలక్ట్రిక్ మోడ్ కూడా ఉంటుంది, అయితే ఇది అంత ఉపయోగకరమైనది కారు. ఈ మోడ్‌లో రేంజ్ రోవర్ హైబ్రిడ్ వాహనాలను గంటకు గరిష్టంగా 48 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించలేము, ఈ మోడ్‌లో కేవలం 1 మైలు దూరం మాత్రమే ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








