గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో 'డస్టర్ బ్లాక్ ఎడిషన్'
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌ను గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్రాండ్ క్రింద కంపెనీ విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బ్రిటన్ కొనుగోలుదారుల కోసం కంపెనీ డస్టర్‌లో బ్లాక్ ఎడిషన్ పేరిట ఓ స్పోర్టీ వెర్షన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం జరిగే గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ అనే ఆటో షోలో డాసియా డస్టర్ బ్లాక్ ఎడిషన్‌ను ప్రదర్శనకు ఉంచారు.
డాసియా డస్టర్ ఆంబియన్స్ డిసిఐ 110 బిహెచ్‌పి (మిడిల్ వేరియంట్)ను ఆధారంగా చేసుకొని ఈ బ్లాక్ ఎడిషన్‌ను తయారు చేశారు. ఇది కేవలం టూవీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బ్లాక్ ఎడిషన్ డస్టర్‌లో వినైల్ బాడీ పెయింటింగ్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో పాటుగా కారు పైభాగంలో (రూఫ్‌కు) జోడించిన అధనపు లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ కొత్త డస్టర్ బ్లాక్ ఎడిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

గుడ్‌వుడ్ స్పెషల్
యూకేలో ప్రతి ఏటా జరిగే గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ అనే ఆటో షో కోసం ఈ డాసియా డస్టర్ బ్లాక్ ఎడిషన్‌ను తయారు చేశారు. ఇటీవలే ముగిసిన ఈ షోలో డస్టర్ బ్లాక్ ఎడిషన్ చూపరుల దృష్టిని ఆకట్టుకుంది.

వేరియంట్
డాసియా డస్టర్ ఆంబియన్స్ డిసిఐ 110 బిహెచ్‌పి (మిడిల్ వేరియంట్)ను ఆధారంగా చేసుకొని ఈ బ్లాక్ ఎడిషన్‌ను తయారు చేశారు. ఇది కేవలం టూవీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎక్స్టీరియర్స్
- బ్రష్డ్ బ్లాక్ వినైల్ వ్రాప్ ఫినిష్
- 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్
- రూఫ్ మౌంటెడ్ హెడ్‌లైట్స్

ఇంటీరియర్స్
- 6 ఇంచ్ టచ్ స్క్రీన్ కెన్‌వుడ్ మీడియా సిస్టమ్
- బ్లూటూత్, డిఏబి రేడియో, యూఎస్‌బి, ఐపాడ్, డివిడి, జిపిఎస్ నావిగేషన్ సపోర్ట్

ఇంటీరియర్స్
- ప్రీమియం లెథర్ సీట్స్
- లెథర్ అప్‌హోలెస్ట్రీ

ధర
బ్రిటన్ మార్కెట్లో డస్టర్ బ్లాక్ ఎడిషన్ ధర 17,575 పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.16 లక్షలు).

భారత మార్కెట్‌కు వస్తుందా..?
డస్టర్ బ్లాక్ ఎడిషన్ భారత్‌కు వస్తుందో రాదో తెలియదు కానీ, రెనో డస్టర్ భారత మార్కెట్లో విడుదలై ఏడాది కావస్తున్న సందర్భంగా కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ ప్రవేశపెట్టే అవకాశం మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








