ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో రెనో/డాసియా డస్టర్ లాంచ్?
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రాకతో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ పెరగడంతో, ఈ సెగ్మెంట్లో ఇదివరకే డస్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇప్పుడు తన అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెనో అందిస్తున్న డస్టర్ (గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్రాండ్ క్రింద అమ్ముడవుతోంది) భారత మార్కెట్లోనే కాకుండా అన్ని ప్రపంచ మార్కెట్లలోను మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మరింత మెరుగైన రెనో/డాసియా డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల కావచ్చని సమాచారం. ఈ అప్‌గ్రేడెడ్ డస్టర్ ఎస్‌యూవీకి చెందిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. డస్టర్ డి క్రాస్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
కొత్త డస్టర్ ముందు వైపు పూర్తిగా సరికొత్త బాడీ స్టయిల్‌ను కలిగి ఉండనుంది. వెనుక డిజైన్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే ఆస్కారం ఉంది. కేవలం ఎక్స్టీరియర్లలోనే కాకుండా ఇంటీరియర్లలో కూడా మార్పులు ఉండనున్నాయి. సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి బెటర్ ఎలక్ట్రానిక్స్, మంచి నాణ్యత కలిగిన అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులను ఈ కొత్త డస్టర్‌లో గమనించవచ్చు.
అయితే, ఇండియన్ వెర్షన్ డస్టర్‌లో ఇన్ని ఎక్కువ మార్పులను ఆశించలేము. ఒకవేళ ఇన్ని మార్పులు చేర్పులతో కూడిన డస్టర్ ఇండియాకు వస్తే, దాని ధర మరింత ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. మైలేజ్, కర్భన వ్యర్థాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఇంజన్‌ను రీట్యూన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది భారత్‌కు రావాలంటే 2014 వరకు సమయం పట్టొచ్చని తెలుస్తోంది.

డస్టర్ డి క్రాస్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కొత్త అప్‌గ్రేడెడ్ డస్టర్‌ను మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

డస్టర్ డి క్రాస్ కాన్సెప్ట్‌ను ఇటీవల జరిగిన సావ్ పాలో ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించింది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్‌కు సంబంధించిన స్పై చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచరిస్తున్నాయి.

డస్టర్ డి క్రాస్ కాన్సెప్ట్‌లోని డిజైన్ క్యూలను కొత్త డస్టర్‌లో చూసే అవకాశం ఉంది.

డస్టర్ డి క్రాస్ కాన్సెప్ట్


Click it and Unblock the Notifications








