ఫేస్‌లిఫ్ట్ రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫొటోలు విడుదల

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యధింగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'డస్టర్'లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో పేర్కొన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, రెనో వచ్చే నెలలో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనున్న అప్‌గ్రేడెడ్ డస్టర్ అఫీషియల్ ఫొటోలను విడుదల చేసింది.

గ్లోబల్ మార్కెట్లో డాసియా (రెనో కంపెనీకి చెందిన) బ్రాండ్ క్రింద డస్టర్ అమ్ముడువుతోంది. అప్‌గ్రేడెడ్ 2013 డాసియా డస్టర్ (భారత మర్కెట్లో రెనో డస్టర్‌గా అమ్ముడవుతోంది) అఫీషియల్ ఫస్ట్ లుక్ ఫొటోలను ఈ కథనంలో చూడొచ్చు.


ఈ కొత్త అప్‌గ్రేడెడ్ డస్టర్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. రివైజ్డ్ గ్రిల్, రెండు క్రోమ్ ప్లేటెడ్ స్ట్రిప్స్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లతో కూడిన కొత్త డబుల్ ఆప్టిక్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎయిర్ ఇన్‌టేక్ వంటి మార్పులను గమనించవచ్చు. అలాగే రూఫ్ బార్స్‌పై డస్టర్ లోగో, 16 ఇంచ్ డార్క్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కొత్త టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్‍‌‌లో చూడొచ్చు.

రెనో ఇండియా తమ డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని జులై 2012లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే మంచి సక్సెస్‌ను సాధించింది. డస్టర్ భారత్‌లో విడుదలైన ఏడాది సమయం లోనే సుమారు 56,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ నుంచి డస్టర్ గట్టి పోటీని ఎదుర్కుంటూనే, అమ్మకాల పరంగా దూసుకుపోతుంది.

Duster Facelift

కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డాసియా డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 10, 2013న జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు. త్వరలోనే ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొత్త రెనో డస్టర్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా మాత్రమే మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 28, 2013, 15:27 [IST]
English summary
French carmaker Renault-owned Dacia has revealed the Duster SUV facelift images. The Dacia Duster facelift will bw unveiled at the upcoming FrankFurt motor show starting 10th Sep 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+