రెనో డస్టర్ 1 ల్యాక్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా గడచిన జులై 2012లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'డస్టర్' రెండేళ్ల కన్నా తక్కువ సమయంలోనే ఒక లక్షకు పైగా యూనిట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసినదే. రెనో డస్టర్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రెనో ఇండియా ఈ మోడల్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
'ఒక లక్ష లిమిటెడ్ ఎడిషన్' (1 Lakh Limited Edition) పేరిట్ రెనో ఇండియా విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ డస్టర్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ప్లస్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ డస్టర్‌ను అందిస్తున్నారు. ఈనెల (జూన్ 2014) నుంచే ఇది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
ఈ వేరియంట్లో బీజ్ కలర్ ఇంటీరియర్స్, ఏబిఎస్, ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు సంబంధించి రెనో ఇండియాకు అంతకు మించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి..!



Click it and Unblock the Notifications








