ఆల్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్ ఎస్‌యూవీ వస్తోంది!

By Ravi

ప్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో త్వరలోనే ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇప్పటి వరకు రెనో డస్టర్ కేవలం టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఫోర్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను విడుదల చేస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

రెనో ఇండియా ఇప్పటికే తమ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన డస్టర్ ఎస్‌యూవీని చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన ఫోర్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను డాసియా బ్యాడ్జ్‌తో యూరప్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. రెనో ఇండియా తొలిసారిగా తమ డస్టర్ ఎస్‌యూవీని 2012లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.


అయితే, ఆ తర్వాత క్రమంగా ఈ మోడల్‌కు గిరాకీ తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెరిగిన పోటీనే. ఈ నేపథ్యంలో, ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు డస్టర్ లైనప్‌ను విస్తరించుకోవాలని రెనో యోచిస్తోంది. ఆల్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను విడుదల చేయటం ద్వారా అమ్మకాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ఇండియా నుంచి యూకే మార్కెట్‍‌‌కు ఎగుమతి అవుతున్న రెనో డస్టర్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి. అయితే, ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న ఆల్-వీల్ డ్రైవ్ డస్టర్ మాత్రం కేవలం డీజిల్ వెర్షన్ (107 హెచ్‌పి, 240 ఎన్ఎమ్)లోనే లభ్యం కానున్నట్లు సమాచారం.

Renault D Cross

వాస్తవానికి ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండే ఎస్‌యూవీలను నడపటంలో ఎంతో ఫన్ ఉంటుంది. రెగ్యులర్ టూ-వీల్ (4x2) డ్రైవ్ కార్లలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి ముందు చక్రాలకు కానీ లేదా వెనుక చక్రాలకు (సూపర్ కార్లలో) కానీ బదిలీ అవుతుంటుంది. అయితే, ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ మాత్రం ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో డస్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2014, 10:13 [IST]
English summary
We have for long looked forward to the 4WD variant of the Duster coming to India. That day might be near if a new report is to be believed. According to the report, Mr. Sumit Sawhney, MD and CEO, Renault India has confirmed the all-wheel drive Renault Duster will be launched in India before the end of the year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+