రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 85 పిఎస్ వేరియంట్ విడుదల

By Ravi

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో రెనో ఇండియా ఆవిష్కరించిన 'డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్'లో కంపెనీ ఇప్పటికే 110పిఎస్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో మరో చవక వేరియంట్‌ను విడుదల చేసింది.

రెగ్యులర్ 85పిఎస్ ఆర్ఎక్స్ఈ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను తయారు చేశారు. భారత మార్కెట్లో దీని ధర రూ.9.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. రెగ్యులర్ డస్టర్‌కి ఈ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌కి అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్‌లో అధనపు యాక్ససరీలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌‌ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటుగా మరికొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో లభిస్తుంది.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ ముందు డిజైన్‌ను గమనిస్తే స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌కు ప్రొటెక్షన్‌గా అమర్చిన యాక్ససరీ మరియు అందులోని లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసిన ఈ అడ్వెంచర్ ఎడిషన్, దాని పేరుకు తగినట్లుగానే సైడ్స్‌పై ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ థీమ్ కనిపిస్తుంది. అలాగే సైడ్ సిల్స్, ప్లాస్టిక్ వీల్ ఆర్చ్ మరియు బాడీ క్లాడింగ్‌లు ఇందులో కొత్తగా చేర్చబడినవి.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ వెనుక వైపు డి పిల్లర్ దగ్గర కంపాస్ ఆకారంలో ఉండే అడ్వెంచర్ డెకాల్‌ను మనం ఇందులో చూడొచ్చు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో సరికొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

పేరుకు తగినట్లుగానే డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ఇంటీరియర్లను కూడా అప్‌డేట్ చేశారు. లైమ్ గ్రీన్ సీట్ కవర్, అప్‌హోలెస్ట్రీ, డోర్ ట్రిమ్ ఫ్యాబ్రిక్, మెటల్ ఫినిష్ గ్రాబ్ హ్యాండిల్‌ను ఇందులో చూడొచ్చు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో కొత్త ఫ్లోర్ మ్యాట్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫ్లోర్ మ్యాట్స్‌పై డస్టర్ లోగోతో పాటుగా, వీటి చివర్లను ఇంటీరియర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యేలా లైమ్ గ్రీన్‌ ఎంబ్రాయిండింగ్‌తో అందిస్తున్నారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

అలాగే, సెంటర్ కన్సోల్‌కు మరియు స్టీరింగ్ వీల్‌కు పియానో బ్లాక్ ఫినిషింగ్‌ను చేర్చారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌‌లో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. రెగ్యులర్ డస్టర్‌లో ఉపయోగించిన 1.5 లీటర్, 85 పిఎస్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 31, 2014, 11:07 [IST]
English summary
Following the launch of Renault Duster Adventure Edition 110PS variant in February 2014, the Frenc carmaker has launched the another variant in the cheaper 85 PS RxE guise. Renault Duster Adventure Edition 85PS RxE is priced at INR 9.16 lakhs (Ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+