మీ పాత రెనో డస్టర్‌ను కూడా అడ్వెంచర్ ఎడిషన్‌గా మార్చుకోవచ్చు!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ఇటీవలే డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరిట మరింత రగ్గడ్‌గా కనిపించే డస్టర్ వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. తొలుత 110 పిఎస్ వేరియంట్లో మాత్రమే డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ విడుదల కాగా, ఆ తర్వాతి కాలంలో కంపెనీ 85 పిఎస్ వేరియంట్లో కూడా అడ్వెంచర్ ఎడిషన్‌ను ప్రవెశపెట్టింది. దీంతో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే, అడ్వెంచర్ ఎడిషన్ విడుదలకు ముందే డస్టర్‌ను కొనుగోలు చేసిన వారు, అయ్యో.. ఈ కొత్త వేరియంట్‌ను మిస్ అయిపోయామే అని బాధ పడుతున్నారు. అలాంటి వారు ఇక చింతిచాల్సిన అసరం లేదు. ఎందుకంటే, తమ పాత డస్టర్‌నే ఇప్పుడు అడ్వెంచర్ ఎడిషన్‌గా మార్చేసుకోవచ్చు. అవునండి.. రెనో ఇండియా ఇప్పుడు అడ్వెంచర్ ఎడిషన్ ఓ యాక్ససరీ ప్యాకేజ్‌గా ఆఫర్ చేస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ కిట్

ఈ అడిషనల్ అడ్వెంచర్ ఎడిషన్ యాక్ససరీ ప్యాకేజ్‌తో ప్రస్తుత పాత డస్టర్లనే ఆఫ్-రోడర్‌లా కనిపించే డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌గా మార్చేసుకోవచ్చు. ఈ యాక్ససరీ ప్యాకేజ్‌ను కంప్లీట్ కిట్‌గా కానీ లేదా ఇండివిడ్యువల్‌గా మీకు నచ్చిన భాగాలను మాత్రమే ఎంచుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ కిట్

అయితే, రెగ్యులర్ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌‌లో లభించే స్పెషల్ ఫ్లోర్ మ్యాట్స్, సీట్ కవర్స్ వంటి మాత్రం ఈ ప్యాకేజ్‌లో లభ్యం కావు. కేవలం ఎక్స్టీరియర్ కిట్స్ మాత్రమే ఇందులో లభిస్తాయి. స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే రెగ్యులర్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ వేరియంట్ ధర సుమారు రూ.1 లక్ష వరకు అదనంగా ఉంటోంది. కానీ ఈ యాక్ససరీ ప్యాక్ మాత్రం తక్కువ ధరకే లభిస్తుంది.

కంప్లీట్ ఎక్స్టీరియర్ క్లాడింగ్ ప్యాకేజ్

కంప్లీట్ ఎక్స్టీరియర్ క్లాడింగ్ ప్యాకేజ్

ఇది కంప్లీట్ బాడీ కిట్. ఇందులో రెండు లైట్లతో కూడిన ఫ్రంట్ బంపర్ గార్డ్, ప్రొటెక్టివ్ సైడ్ మౌల్డింగ్, వీల్ ఆర్చెస్ క్లాడింగ్స్ లభిస్తాయి. ఈ కంప్లీట్ బాడీ కిట్ ధర రూ.62,390.

ఫ్రంట్ బంపర్ గార్డ్

ఫ్రంట్ బంపర్ గార్డ్

రెండు లైట్లతో కూడిన ఫ్రంట్ బంపర్ గార్డ్‌ను మాత్రమే అమర్చుకోవాలనుకు వారు దీనిని ఎంచుకోవచ్చు. ఈ యాక్ససరీ కిట్ ధర రూ.18,410.

సైడ్ బాడీ క్లాడింగ్

సైడ్ బాడీ క్లాడింగ్

కేవలం సైడ్స్ మాత్రమే మార్చుకోవాలనుకునే వారు రూ.19,320 చెల్లించి ఈ కిట్ కొనుగోలు చేయవచ్చు.

వీల్ ఆర్చెస్

వీల్ ఆర్చెస్

అలా కాకుండా కేవలం వీల్ ఆర్చెస్ మాత్రమే మార్చుకోవాలనుకునే వారు రూ.24,660 చెల్లించి ఈ కిట్ కొనుగోలు చేయవచ్చు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ కిట్

ఏ రెనో డస్టర్ వేరియంట్‌కైనా ఈ యాక్ససరీలను ఫిట్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. కంపెనీ ఇటీవలే ప్రకటించిన రెనో డస్టర్ 1 లక్షవ ఎడిషన్‌కు కూడా ఈ యాక్ససరీలను ఫిక్స్ చేయించుకోవచ్చు. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌కు పెరిగిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ అడ్వెంచర్ యాక్ససరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2014, 12:40 [IST]
English summary
Do you already own a Duster Adventure Edition, but dig the Adventure Edition, with its rugged looking side cladding and fog lamp equipped bumper protector? You will be pleased to know that Renault understands your predicament and has decided to make the features of the Duster Adventure Edition available as separate accessories.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+