రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'డస్టర్'లో 'అడ్వెంచర్ ఎడిషన్' పేరిట కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను వేరియంట్‌ను భారత కార్ మార్కెట్లో విడుదల చేసింది. గడచిన సంవత్సరం జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో రెనో తొలిసారిగా ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ డాసియా డస్టర్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన సరికొత్త డస్టర్‌ను కంపెనీ ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌లో కూడా ప్రదర్శనకు ఉంచింది.
రెగ్యులర్ 110పిఎస్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను తయారు చేశారు. భారత మార్కెట్లో దీని ధర రూ.12.18 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. రెగ్యులర్ డస్టర్‌కి ఈ అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌కి అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్‌లో అధనపు యాక్ససరీలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
మరి ఈ రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లోని ఆ అడ్వెంచరస్ ఫీచర్లేంటో తెలుసుకోవాలంటే, ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించాల్సిందే.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటుగా మరికొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో లభిస్తుంది.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ముందు డిజైన్‌ను గమనిస్తే స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌కు ప్రొటెక్షన్‌గా అమర్చిన యాక్ససరీ మరియు అందులోని లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసిన ఈ అడ్వెంచర్ ఎడిషన్, దాని పేరుకు తగినట్లుగానే సైడ్స్‌పై ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ థీమ్ కనిపిస్తుంది. అలాగే సైడ్ సిల్స్, ప్లాస్టిక్ వీల్ ఆర్చ్ మరియు బాడీ క్లాడింగ్‌లు ఇందులో కొత్తగా చేర్చబడినవి.

డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ వెనుక వైపు డి పిల్లర్ దగ్గర కంపాస్ ఆకారంలో ఉండే అడ్వెంచర్ డెకాల్‌ను మనం ఇందులో చూడొచ్చు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో సరికొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

పేరుకు తగినట్లుగానే డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ఇంటీరియర్లను కూడా అప్‌డేట్ చేశారు. లైమ్ గ్రీన్ సీట్ కవర్, అప్‌హోలెస్ట్రీ, డోర్ ట్రిమ్ ఫ్యాబ్రిక్, మెటల్ ఫినిష్ గ్రాబ్ హ్యాండిల్‌ను ఇందులో చూడొచ్చు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో కొత్త ఫ్లోర్ మ్యాట్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫ్లోర్ మ్యాట్స్‌పై డస్టర్ లోగోతో పాటుగా, వీటి చివర్లను ఇంటీరియర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యేలా లైమ్ గ్రీన్ ఎంబ్రాయిండింగ్‌తో అందిస్తున్నారు.

అలాగే, సెంటర్ కన్సోల్‌కు మరియు స్టీరింగ్ వీల్‌కు పియానో బ్లాక్ ఫినిషింగ్‌ను చేర్చారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో యూఎస్‌బి పోర్ట్, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, మీడియాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3900 ఆర్‌పిఎమ్ వద్ద 110 పిఎస్‌ల శక్తిని, 2250 ఆర్‌పిఎమ్ వద్ద 248 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మరి ఈ సరికొత్త రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మీకు నచ్చిందా..?


Click it and Unblock the Notifications








