రెనో డస్టర్ ఆల్ వీల్ డ్రైవ్ విడుదల; ధర రూ.11.89 లక్షలు
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో కంపెనీ ఓ పవర్‌ఫుల్ ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడి) వేరియంట్‌ను నేడు (సెప్టెంబర్ 24, 2014) మార్కెట్లో విడుదల చేసింది.
రెగ్యులర్ రెనో డస్టర్‌కు మరియు ఈ కొత్త రెనో డస్టర్ ఆల్ వీల్ డ్రైవ్‌కు బేసిక్ డిజైన్ పెద్దగా మార్పులేమీ లేవు. కొత్త రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఎక్స్టీరియర్స్
రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో ప్రధానంగా.. స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, స్మోక్డ్ గ్రే అల్లాయ్ వీల్స్, మ్యాట్ బ్లాక్ ఫినిష్ బి-పిల్లర్, ఏడబ్ల్యూడి డెకాల్స్ (స్టిక్కర్స్) మరియు 4x4 బ్యాడ్జింగ్ వంటి ఎక్స్టీరియర్ మార్పులున్నాయి.

ఇంటీరియర్స్
ఇంటీరియర్స్‌లో కొత్త త్రీ-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టీయర్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, బ్రైట్ రెడ్ అండ్ గ్రే సీట్స్, కొత్త సెంటర్ కన్సోల్ (అడ్వెంచర్ ఎడిషన్ నుంచి గ్రహించబడినది), డ్యాష్‌బోర్డుపై గ్రే కలర్ సెంటర్ స్ట్రిప్ వంటి మార్పులున్నాయి.

ఆల్ వీల్ డ్రైవింగ్ మోడ్
రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో ఉపయోగించిన ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మూడు మోడ్స్‌ని కలిగి ఉంటుంది. అవి టూ-వీల్ డ్రైవ్, ఆటో మరియు ఫోర్-వీల్ డ్రైవ్. డ్రైవర్ ఇష్టానికి అనుగుణంగా ఈ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ఆల్-వీల్ ఇండిపెండెంట్ మల్టీ-లింక్ సస్పెన్షన్ మరో అదనపు ప్రత్యేకత. ఇంకా ఇందులో రెనో ఎలక్ట్రానిక్ టార్క్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. అధిక వేగాల వద్ద అన్ని చక్రాలకు సమతౌల్యంగా టార్క్‌ను పంపిణీ చేసేందుకు ఈ సిస్టమ్ సహకరిస్తుంది.

ఇంజన్
రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 248 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఫీచర్లు
ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, యాంబీంట్ టెంపరేచర్ గేజ్, రియల్‌టైమ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్ మరియు యూఎస్‌బి, ఆక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ 2-డిన్ ఆడియో సిస్టమ్‌తో పాటుగా ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, మరియు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ధరలు
రెనో డస్టర్ ఏడబ్ల్యూడి రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధరలు ఇలా ఉన్నాయి:
* రెనో డస్టర్ ఏడబ్ల్యూడి ఆర్ఎక్స్ఎల్ - రూ.11.89 లక్షల
* రెనో డస్టర్ ఏడబ్ల్యూడి ఆర్ఎక్స్‌జెడ్ - రూ.12.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








