విశిష్టమైన స్టైల్‌లో రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొద్ది కాలంలోనే అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన సంగతి తెలిసినదే. రెనో డస్టర్‌‌లో మన ఇప్పటికే వివిధ విభిన్నమైన మోడళ్లను చూశాం. అలాగే, కొన్ని కస్టమైజ్డ్ మోడళ్లను కూడా చూశాం. అందులో డస్టర్ లీమోజైన్, డస్టర్ బ్లాక్ ఎడిషన్, డస్టర్ అడ్వెంచర్ లిమిటెడ్ ఎడిషన్‌లతో పాటు డిసి డిజైన్స్ మోడిఫైడ్ డస్టర్‌ను కూడా చూశాం.

కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది వీటిన్నింటి కన్నా విశిష్టమైన డస్టర్ గురించి. ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్న రెనో డస్టర్‌ను చూడండి. దీని పేరు 'డస్టర్ డిటూర్ కాన్సెప్ట్' (Duster Detour Concept). జోహన్స్‌బర్గ్ ఇంటర్నేషల్ మోటార్ షోలో ఈ సరికొత్త రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శను ఉంచారు.

ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్ స్కీమ్‌తో ఈ మోటార్ షోలో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలిచిన ఈ స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ కారును రెనోకు చెందిన యూరోపియన్ డిజైన్ స్టూడియో, జోహన్‌బర్గ్‌లోని స్థానిక డిజైన్ స్డూడియోతో కలిసి అభివృద్ధి చేసింది.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

"మ్యాడ్ మ్యాక్స్, టెర్మినేటర్ మరియు డాకర్ డస్ట్"ల మధ్య క్రాసే ఈ డిటూర్ కాన్సెప్ట్ అని రెనో పేర్కొంది.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

ఈ రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్‌ను చూడగానే ప్రధానంగా ఆకట్టుకునేది, దీని ఫ్లాషీ పెరల్ యల్లో పెయింట్ జాబ్.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

అలాగే, దీని వెనుక వైపు మ్యాట్ గ్రే కలర్ ఫినిషింగ్‌తో కూడిన పెయింట్ జాబ్, పెద్ద అక్షరాలతో డిజైన్ చేయబడిన 'డస్టర్' డెకాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

ఫంక్షనల్ మోడిఫికేషన్స్ విషయానికి వస్తే, రెనో డిటూర్ కాన్సెప్ట్‌లో పెంచబడిన రైడ్ హైట్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆల్-టెర్రైన్ టైర్స్ వంటి మార్పులను గమనించవచ్చు.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ ముందు వైపు గమనిస్తే, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై రెండు ప్రొజెక్టర్ లైట్స్, రూఫ్ మౌంటెడ్ సెర్చ్ లైట్స్, పెద్ద క్రోమ్ రెనో లోగోలతో ఇది సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

టింటెడ్ విండోస్, బ్లాక్ కలర్ బి-పిల్లర్స్, విశాలమైన వీల్ అర్చెస్ వంటి స్టయిలింగ్ మార్పులను కూడా ఇందులో చూడొచ్చు.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ వెనుక వైపు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, డబుల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్స్ (సైలెన్సర్స్), కొత్త రూఫ్ స్పాయిలర్, కొత్త డిఫ్యూజర్‌లను చూడొచ్చు.

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్

రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ కేవలం కాన్సెప్ట్‌గానే మిగిలిపోయే అవకాశాలున్నాయి. ఇది ప్రొడక్షన్ దశకు చేరుకునే అవకాశాలు లేవు. అయితే, ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని లిమిటెడ్ ఎడిషన్ మోడల్ తయారయ్యే అవకాశాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 17, 2013, 15:39 [IST]
English summary
Renault Duster Detour Concept, showcased at the ongoing Johannesburg International Motor Show, focuses on the off-roading abilities of the compact SUV, with the addition of touring specific modifications. And not to mention, an attention grabbing colour scheme. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+