త్వరలో భారత్‌కు రానున్న రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్
రెనో డస్టర్ డిజైన్ మీకు రొటీన్‌గా అనిపిస్తోందా.. మీరు సరికొత్త రెనో డస్టర్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, త్వరలోనే మీ ఎదురుచూపులు ఫలించనున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
ఈ ఏడాది జరిగిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో రెనో తొలిసారిగా ఆవిష్కరించిన అప్‌గ్రేడెడ్ డస్టర్‌ను వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. డస్టర్ ఎస్‌యూవీ రెనో కంపెనీకి కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యధింగా అమ్ముడుపోతున్న మోడల్. ఈ మోడల్‌కు మరింత మోడ్రన్ టచ్‌నిచ్చేలా రెనో ఈ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది.
అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రెనో ఇండియా తమ సరికొత్త డస్టర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త డస్టర్‌లో చేసిన మార్పుల చేర్పుల వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

కొత్త అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. రివైజ్డ్ గ్రిల్, రెండు క్రోమ్ ప్లేటెడ్ స్ట్రిప్స్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లతో కూడిన కొత్త డబుల్ ఆప్టిక్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎయిర్ ఇన్‌టేక్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

కొత్త డస్టర్ రూఫ్ రెయిల్స్‌పై డస్టర్ లోగో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇంకా ఇందులో 16 ఇంచ్ డార్క్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కొత్త టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను చూడొచ్చు.

కొత్త రెనో డస్టర్ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

ఇందులో ప్రధానంగా, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, కొత్త సెంటర్ కన్సోల్, కొత్త రెనో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టోరేజ్ బాక్స్‌తో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇండియన్ వెర్షన్ రెనో డస్టర్‌లో కాస్మోటిక్ మార్పులు తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

రెనో ఇండియా తమ డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని జులై 2012లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే మంచి సక్సెస్‌ను సాధించింది.

డస్టర్ భారత్‌లో విడుదలైన ఏడాది సమయం లోనే సుమారు 56,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ నుంచి డస్టర్ గట్టి పోటీని ఎదుర్కుంటూనే, అమ్మకాల పరంగా దూసుకుపోతుంది.

కొత్త రెనో డస్టర్‌కు సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








