రెనో డస్టర్‌లో కొత్త వేరియంట్ విడుదల; వివరాలు
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో కంపెనీ ఓ సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. 'రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ప్లస్' (Renault Duster RxL Plus) పేరిట కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.
ఈ కొత్త రెనో డస్టర్ 85 పిఎస్ ఆర్ఎక్సఎల్ ప్లస్ వేరియంట్లో అదనపు సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి కాంపిటీటర్ల నుంచి పెరుగుతున్న పోటీ దృష్టిలో ఉంచుకొని రెనో ఇండియా ఈ కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది.

రెనో డస్టర్ 85 పిఎస్ ఆర్ఎక్సఎల్ ప్లస్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.
కొనుగోలుదారులు కావాలనుకుంటే, ఆర్ఎక్స్ఎల్ ప్లస్ వేరియంట్‌కు అదనంగా ఆప్షనల్ ప్యాకేజ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ ఆప్షనల్ ప్యాక్‌లో పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్‌ను ఆఫర్ చేస్తున్నారు. డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ప్లస్ వేరియంట్లో కేవలం ఈ మార్పుల మినహా వేరే ఇతర మార్పులేవీ లేవు.

కొత్త రెనో డస్టర్ 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ప్లస్ వేరియంట్ ధర రూ.10.6 లక్షలు గాను మరియు ఆర్ఎక్స్ఎల్ ప్లస్ ఆప్షన్ ప్యాక్ ధర రూ.11.18 లక్షలు గాను ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). రెనో డస్టర్ 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని మరియు 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








