రెనో డస్టర్‌లో కొత్త వేరియంట్ విడుదల; ధర రూ.12.13 లక్షలు

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో మరొక వేరియంట్‌ను జోడించింది. రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ ప్లస్ (Renault Duster RxZ Plus) పేరుతో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

టాప్-ఎండ్ ఆర్ఎక్స్‌జెడ్ వేరియంట్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఈ కొత్త వేరియంట్ (ఆర్ఎక్స్‌జెడ్ ప్లస్)లో లభిస్తాయి. కానీ, ఇందులో వెనుక సీట్లలోని ప్యాసింజర్ల కోసం మధ్య వరుసలో ఏర్పాటు చేసిన రియర్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మాత్రం లభ్యం కాదు.


కొందరు డీలర్లు తెలిపిన సమాచారం ప్రకారం, మధ్య వరుసలోని సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల కోసం ఎక్కువ స్థలం ఉండటం లేదని కస్టమర్ల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని రెనో డస్టర్‌లో అర్ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్ ధర రూ.12.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఇంది. ఇది డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ ఆప్షన్ ప్యాక్ వేరియంట్ ధర (రూ.12.18 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కన్నా రూ.5,000 తక్కువగా ఉంటుంది.

Renault Duster SUV

కంపెనీ విడుదల చేసిన రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 10, 2013, 13:20 [IST]
English summary
French carmaker Renault India has added another variant to its popular Duster SUV lineup called the RxZ Plus. This new variant comes with all features available on the top-end RxZ variant but loses rear ac unit. Renault Duster RxZ Plus diesel is priced at Rs 12.13 lakh (ex-showroom,Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+