2014 సావ్ పాలో మోటార్ షో: 'రెనో డస్టర్ ఒరాక్' కాన్సెప్ట్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన డబుల్ క్యాబిన్ పికప్ కాన్సెప్ట్ 'రెనో డస్టర్ ఒరాక్' (Renault Duster Oroch) బ్రెజిల్‌లో జరుగుతున్న 28వ అంతర్జాతీయ సావ్ పాలో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించింది. ఫోర్-డోర్ పికప్ బాడీ డిజైన్‌లో తీర్చిదిద్దిన రెనో డస్టర్, ఈ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

డాసియా డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇప్పటికే పరిమిత సంఖ్యలో సింగిల్ క్యాబిన్, 2-డోర్ పికప్ తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఇందులో 4-డోర్ క్రూ క్యాబ్ బాడీతో కూడిన ఈ కొత్త డస్టర్‌ను డిజైన్ చేయటం మాత్రం ఇదే ప్రప్రథమం. రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్‌కి సంబంధించిన మరింత సమచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

తర్వాతి స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్ 4-డోర్ పికప్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్‌ను లాటిన్ అమెరికాలోని రెనో డిజైన్ సెంటర్ డిజైన్ చేసింది. ఐదుగురు ప్రయాణీకుల సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా, అలాగే కొంత లగేజ్‌ను తమ వెంట తీసుకొని వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్‌తో ఈ పికప్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. గతంలో కంపెనీ ఆవిష్కరించిన డస్టర్ డి-క్రాస్ డిజైన్ క్యూలను ఇందులో గమనించవచ్చు.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

తమ లాటిన్ అమెరికన్ మార్కెట్ల కోసం అత్యుత్తమ ఉత్పత్తుల తయారు చేయాలనే వ్యూహం నుంచి పుట్టుకొచ్చిందే డస్టర్ ఒరాక్ అని, రెనో అమెరికాస్ రీజియన్ చైర్మన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ బార్బీర్ తెలిపారు.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్‌లో విశాలమైన క్యాబిన్, 18 ఇంచ్ వీల్స్, 255x60 R18 టైర్స్, రైజ్డ్ సస్పెన్షన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, అప్‌గ్రేడెడ్ లైట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ పానోరమిక్ సన్‌‌రూఫ్ (కారు పైభాగం) కలిగి ఉంటుంది. దీనిని ధృడమైన గ్లాస్‌తో తయారు చేశారు. ఈ కాన్సెప్ట్ కారు ద్వారా ఆసక్తికరమైన స్పోర్టింగ్ మొమెంట్స్‌ని క్యాప్చూర్ చేసేందుకు వెనుక భాగంలో 80, 140 డిగ్రీ రొటేటింగ్ కెమెరాలను అమర్చారు.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

ఇంటీరియర్స్‌లో డ్యాష్‌బోర్డుపై మల్టీమీడియా స్క్రీన్ ఉంటుంది. డ్యూయెల్ క్యాబ్‌కు వెలుపల అమర్చిన కెమెరాల సాయంతో క్యాప్చూర్ చేసిన దృశ్యాలను ఈ స్క్రీన్‌పై చూడొచ్చు. సెంటర్ కన్సోల్‌లో ఉండే రోటరీ కంట్రోల్ ద్వారా ఈ కెమెరాలను ఆపరేట్ చేయవచ్చు.

డస్టర్ డబుల్ క్యాబిన్ పికప్

ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే, దీని ప్రొడక్షన్ ప్లాన్స్ మరియు ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా తర్వాతి స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ వీడియోని వీక్షించండి.

వీడియో

ఈ స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ వీడియోని వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Friday, October 31, 2014, 7:47 [IST]
English summary
Renault has unveiled the Duster Oroch show car at the 28th Sao Paulo Motor Show in Brazil. Designed by the Renault design centre for Latin America (RDAL) in Sao Paulo, the Duster Oroch show car is a styling exercise for a recreational pick-up truck with enough room for five people and the robust stance of a true SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+