'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్ ఆవిష్కరణ

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్, త్వరలోనే కొత్త అవతారంలో కనిపించనుంది. ఈ పాపులర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 4-డోర్ పికప్ ట్రక్ కాన్సెప్ట్‌ని అభివృద్ధి చేసింది. 'రెనో డస్టర్ ఒరాక్' (Renault Duster Oroch) అనే పేరుతో, 4-డోర్ పికప్ బాడీ డిజైన్‌లో కంపెనీ ఓ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది.

రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్ వాహనాన్ని మరికొద్ది రోజుల్లో జరగనున్న 2014 సావ్ పాలో మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. డస్టర్ ఇప్పటికే 2-డోర్ పికప్ ప్రోటోటైప్‌ను తయారు చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఇందులో 4-డోర్ క్రూ క్యాబ్ బాడీతో కూడిన ఈ కొత్త డస్టర్ ఒరాక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ వాహనానికి సంబంధించిన మరింత సమచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

తర్వాతి స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్ 4-డోర్ పికప్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్‌ను లాటిన్ అమెరికాలోని రెనో డిజైన్ సెంటర్ డిజైన్ చేసింది. ఐదుగురు ప్రయాణీకుల సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా, అలాగే కొంత లగేజ్‌ను తమ వెంట తీసుకొని వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్‌తో ఈ పికప్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

తమ లాటిన్ అమెరికన్ మార్కెట్ల కోసం అత్యుత్తమ ఉత్పత్తుల తయారు చేయాలనే వ్యూహం నుంచి పుట్టుకొచ్చిందే డస్టర్ ఒరాక్ అని, రెనో అమెరికాస్ రీజియన్ చైర్మన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ బార్బీర్ తెలిపారు.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

రెనో డస్టర్ ఒరాక్ కాన్సెప్ట్‌లో 18 ఇంచ్ వీల్స్, 60 టైర్స్, రైజ్డ్ సస్పెన్షన్, అప్‌గ్రేడెడ్ లైట్స్ వంటి మార్పులను చూడొచ్చు.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ రూఫ్ (కారు పైభాగాన్ని)ను గ్లాస్‌తో తయారు చేశారు.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

ఈ కాన్సెప్ట్ వాహనం యొక్క వరల్డ్ ప్రీమియర్‌ను అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9, 2014 వరకు బ్రెజిల్‌లో జరగనున్న 28వ సావ్ పాలో మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు.

'రెనో డస్టర్ ఒరాక్' పికప్ కాన్సెప్ట్

ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే, దీని ప్రొడక్షన్ ప్లాన్స్ మరియు ఇతర వివరాలను కంపెనీ 2014 సావ్ పాలో మోటార్ షోలో వెల్లడించనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా తర్వాతి స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ వీడియోని వీక్షించండి.

వీడియో

ఈ స్లైడ్‌లలో రెనో డస్టర్ ఒరాక్ 4-డోర్ పికప్ కాన్సెప్ట్ వీడియోని వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 29, 2014, 12:33 [IST]
English summary
Renault is set to unveil the Duster Oroch show car in a world premiere at the 28th Sao Paulo Motor Show in Brazil (October 30-November 9). Designed by the Renault design centre for Latin America (RDAL) in Sao Paulo, the Duster Oroch show car is a styling exercise for a recreational pick-up truck with enough room for five people and the robust stance of a true SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+