ఆటో ఎక్స్‌పో 2014: అప్‌గ్రేడెడ్ రెనో ఫ్లూయెన్స్ విడుదల

By Ravi

గడచిన ఏడాది కాలం పైగా వాయిదా పడుతూ వచ్చిన కొత్త రెనో ఫ్లూయెన్ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ కంపెనీ రెనో ఇండియా, తమ అప్‌గ్రేడెడ్ 2014 'ఫ్లూయెన్స్' సెడాన్‌ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది.

వాస్తవానికి రెనో ఇండియా గడచిన సంవత్సరంలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫ్లూయెన్స్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్‌తో డిజైన్, ఫీచర్స్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా రెనో ఇండియా తమ సరికొత్త ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

కొత్త ఫ్లూయెన్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని, ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త 2014 రెనో ఫ్లూయెన్స్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. సన్నటి గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్‌తో ఇది సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

కొత్త ఫ్లూయెన్స్ వెనుక డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. సగం బూట్ డోరుపై, సగం కారుపై ఉండే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, పెద్ద బంపర్‌తో ఇది వెనుక వైపు నుంచి కూడా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగిన ఈ ప్రీమియం సెడాన్‌లో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

ఇంజన్ పరంగా కొత్త ఫ్లూయెన్స్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

పెట్రోల్ వెర్షన్ లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. డీజిల్ వెర్షన్ లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

 
English summary
French auto major Renault has launched its updated premium sedan Fluence at 2014 Auto Expo. Check these exclusive photos.
Please Wait while comments are loading...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+