2014 రెనో ఫ్లూయెన్స్ విడుదల; ధర రూ.13.99 లక్షలు

By Ravi

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా తమ సరికొత్త 2014 రెనో ఫ్లూయెన్ సెడాన్‌ను భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. ఈ అప్‌గ్రేడెడ్ 2014 రెనో ఫ్లూయెన్స్ సెడాన్‌ను కంపెనీ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

కొత్త 2014 రెనో ఫ్లూయెన్స్ సెడాన్ కేవలం రెండు వేరియంట్లలో (ఈ2, ఈ4) మాత్రమే లభ్యం కానుంది. వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* రెనో ఫ్లూయెన్స్ ఈ2 - రూ.13.99 లక్షలు
* రెనో ఫ్లూయెన్స్ ఈ4 - రూ.15.81 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కొత్త 2014 రెనో ఫ్లూయెన్స్ సెడాన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త 2014 రెనో ఫ్లూయెన్స్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. సన్నటి గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్‌తో ఇది సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

కొత్త ఫ్లూయెన్స్ వెనుక డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. సగం బూట్ డోరుపై, సగం కారుపై ఉండే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, పెద్ద బంపర్‌తో ఇది వెనుక వైపు నుంచి కూడా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగిన ఈ ప్రీమియం సెడాన్‌లో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

ఇంజన్ పరంగా కొత్త ఫ్లూయెన్స్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

పెట్రోల్ వెర్షన్ లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. డీజిల్ వెర్షన్ లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఇంకా ఈ కారులో కొత్త ఆడియో సిస్టమ్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, శాటిలైట్ నావిగేషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్టార్ట్-స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఈఎస్‌పి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డస్క్ సెన్సింగ్ హెడ్‌ల్యాంప్స్, రియర్ సన్ బ్లైండ్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2014, 12:50 [IST]
English summary
French auto major Renault has launched its updated premium sedan Fluence in India. The Renault Fluence facelift is available in two trims, the E2 and E4, which are priced at Rs 13.99 lakh and Rs 15.81 lakh, respectively (all prices, ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+