భారత్‌లో అప్‌గ్రేడెడ్ రెనో ఫ్లూయెన్స్ టెస్టింగ్; త్వరలో విడుదల
రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్ త్వరలోనే కొత్త అవతారంలో కనిపించబోతుంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ కంపెనీ రెనో ఇండియా, తొలుత తమ 'ఫ్లూయెన్స్' సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయటం ద్వారా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో ఇండియా 2010వ సంవత్సరంలో తమ ఫ్లూయెన్స్ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే, దీని అధిక ధర కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు.
గతంలో రెనో ఫ్లూయెన్స్ సెడాన్ ధరను భారీగా తగ్గించినప్పటి, దానిపై పలు ఆఫర్లను ప్రకటించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో, సరికొత్త ఫ్లూయెన్స్‌ను సరమైన ధరకే విడుదల చేయాలని రెనో యోచిస్తోంది. ఇప్పటికే రెనో ఇండియా తమ అప్‌గ్రేడెడ్ ఫ్లూయెన్స్ సెడాన్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. చెన్నైలో టెస్టింగ్ చేస్తుండగా, కెమెరాకు చిక్కిన ఫొటోలో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి రెనో ఇండియా గడచిన సంవత్సరంలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫ్లూయెన్స్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్‌తో డిజైన్, ఫీచర్స్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా 2013 రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ను కంపెనీ తయారు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది.
కొత్త ఫ్లూయెన్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొత్త 2013 రెనో ఫ్లూయెన్స్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. సన్నటి గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్‌తో ఇది సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది.

కొత్త ఫ్లూయెన్స్ వెనుక డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. సగం బూట్ డోరుపై, సగం కారుపై ఉండే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, పెద్ద బంపర్‌తో ఇది వెనుక వైపు నుంచి కూడా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగిన ఈ ప్రీమియం సెడాన్‌లో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

ఇంజన్ పరంగా కొత్త ఫ్లూయెన్స్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








