కొత్త 2015 రెనో పల్స్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త 2015 వెర్షన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రెనో డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ కొత్త 2015 రెనో పల్స్ లభ్యం కానుంది. రానున్న నెలల్లో మరో కొత్త వాహనాన్ని కూడా విడుదల చేస్తామని (బహుశా రెనో లాజీ ఎమ్‌పివిని) కంపెనీ పేర్కొంది.

2015 రెనో పల్స్ ధర:
దేశీయ మార్కెట్లో కొత్త 2015 రెనో పల్స్ ప్రారంభ ధరను రూ.5.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్‌లో ఇదివరకటి పల్స్ హ్యాచ్‌బ్యాక్ కన్నా మరిన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

renault pulse launch

2015 రెనో పల్స్ ఇంజన్:

  • కొత్త 2015 రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఎక్స్‌హెచ్5 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 74 హెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 18.1 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
  • కొత్త 2015 రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ గరిష్టంగా 63 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 23.1 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
  • ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఈ కొత్త వెర్షన్ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో లేదు.
renault pulse india launch

2015 రెనో పల్స్ ఫీచర్లు:

  • ఆటోమేటిక్ హెడ్‌లైట్స్
  • హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
  • స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్
  • డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్
  • పియానో బ్లాక్ ఫ్రంట్ ఫేసియా
  • ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్
  • స్మార్ట్ కీ
  • ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్
  • 2 డిన్ మ్యూజియ్ ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి, బ్లూటూత్)

2015 రెనో పల్స్ సేఫ్టీ:

  • ఏబిఎస్
  • ఈబిడి
  • డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్
  • క్రాష్ సెన్సార్స్
renault pulse launch in india

బేసిక్ డిజైన్ పరంగా పెద్దగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అయితే, కంపెనీ ఈ కొత్త 2015 రెనో పల్స్ మోడల్‌పై వారంటీని తగ్గించారు. గతంలో 80,000 కిలోమీటర్లు లేదా 4 ఏళ్లుగా ఉన్న వారంటీని ప్రస్తుతం 50,000 కిలోమీటర్లు లేదా రెండేళ్లకు తగ్గించారు.

More from DriveSpark

Article Published On: Monday, March 2, 2015, 9:46 [IST]
English summary
French automobile manufacturer Renault has launched their new Pulse hatchback in India. It will be available throughout their network of dealerships in India. The company has also promised to launch another new vehicle in India in the coming months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+