డస్టర్ ఎస్‌యూవీ ధరను తగ్గించిన రెనో ఇండియా
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ డస్టర్‌పై ఆకర్షనీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణంగా, ఇతర డీలర్లు ఆఫర్ చేసే విధంగా కాకుండా, నేరుగా రెనో ఇండియా కంపెనీనే తమ డస్టర్ ఎక్స్-షోరూమ్ ధరను తగ్గించడంతో పాటుగా, పలు ఇతర ఆఫర్లను కూడా అందిస్తోంది.
ధర తగ్గింపు తర్వాత రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ డీజిల్ వేరియంట్ ధర రూ.8.18 లక్షలకు తగ్గింది. ఇదివరకు ఈ మోడల్ ధర రూ.8.70 లక్షలుగా ఉండేది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త ధరతో రెనో డస్టర్ ఈ సెగ్మెంట్లోని పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇదే కాకుండా.. రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (డీజిల్) వేరియంట్‌పై కంపెనీ మరో రెండేళ్ల అదనపు వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది. అంటే ఇది మొత్తం 4 ఏళ్ల వారంటీ లేదా 80,000 కి.మీ. వారంటీ (ఏది ముందుగా ముగిస్తే అది)తో లభిస్తుంది. ఇంకా ఉచిత బీమా, రూ.20,000 అశ్శూర్డ్ గిఫ్ట్, 4 ఏళ్ల పాటు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఆఫర్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్ పరిమిత కాలం (సెప్టెంబర్ 15, 2014 వరకు) మాత్రమేనని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది. ఇదే విధంగా లో-ఎండ్ డీజిల్ వేరియంట్ రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్, మిడ్ వేరియంట్ రెనో స్కాలా సెడాన్‌లపై కూడా కంపెనీ తగ్గింపును అందిస్తోంది. రెనో స్కాలా పల్స్ ఆర్ఎక్స్ఎల్ (డీజిల్) వేరియంట్ ధరను రూ.6.16 లక్షల నుంచి రూ.5.69 లక్షలకు తగ్గించగా, రెనో స్కాలా ఆర్ఎక్స్ఎల్ (డీజిల్) వేరియంట్ ధరను రూ.8.86 లక్షల నుంచి రూ.8.29 లక్షలకు తగ్గించారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని రెనో ఇండియా అధీకృత డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








