రెనో కార్లు కొనే వారికి స్పెషల్ బెనిఫిట్స్!

By Ravi

రెనో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి చాన్స్. గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడతూ వస్తున్న నేపథ్యంలో, ఫ్రెంచ్ కార్ కంపెనీ తమ అన్ని ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీలను అందించాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగానే, రెనో డస్టర్ కొనుగోలుదారులకు పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000 ఎక్సేంజ్ బెనిఫిట్ (ఆర్ఎక్స్ఈ, అడ్వెంచర్ ఎడిషన్, ఆర్ఎక్స్ఎల్ పెట్రోల్ వేరియంట్లపై)ను మరియు 85 పిఎస్ (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్ఎల్ ప్లస్, ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్), 110 పిఎస్ (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌జెడ్, ఆర్ఎక్స్‌జెడ్ ప్లస్, ఆర్ఎక్స్‌జెడ్ ఆప్షనల్) డీజిల్ వేరియంట్లపై రూ.25,000 ఎక్సేంజ్ బెనిఫిట్‌‌ను అందిస్తోంది.

Renault India Offers Special Benefits To Its Customers

అంతేకాకుండా, రెనో డస్టర్ కొనుగోలుదారులు రెండేళ్ల అదనపు వారంటీని మరియు నాలుగేళ్ల ఉచిత రోడ్ సైట్ అసిస్టెన్స్‌ను కూడా పొందనున్నారు. ఇంకా, రెనో ఇండియా ఇటీవలే పరిచయం చేసిన 'గ్యాంగ్ ఆఫ్ డస్టర్స్'లో ఉచిత మెంబర్‌షిప్‌ను రెనో డస్టర్ కొనుగోలుదారులకు లభిస్తుంది.

ఇకపోతే, సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రెనో కొలియోస్ ఇప్పటికే డీలర్ల వద్దకు చేరిపోయింది, దీనిపై కంపెనీ రెండేళ్ల అదనపు వారంటీని మరియు నాలుగేళ్ల ఉచిత రోడ్ సైట్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది. పల్స్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులు ఒక్క రూపాయికే ఇన్సూరెన్స్ పొందవచ్చు. దీనిపై కూడా రెండేళ్ల అదనపు వారంటీని మరియు నాలుగేళ్ల ఉచిత రోడ్ సైట్ అసిస్టెన్స్ లభిస్తుంది. రెనో స్కాలా విషయంలో కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2014, 14:48 [IST]
English summary
To increase sales, Renault India is offering special benefits to its customers on across its product range. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+