లాజీ ఎమ్‌పివిని భారత్‌లో విడుదల చేయనున్న రెనో

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) ప్రస్తుతం భారత మార్కెట్లో దాదాపు అన్ని సెగ్మెంట్లలో వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఎమ్‌పివి సెగ్మెంట్లో రెనో ఇండియాకు ప్రస్తుతం ఎలాంటి ఉత్పత్తి లేదు. ఈ నేపథ్యంలో, ఓ కొత్త ఎమ్‌పివిని భారత్‌కు పరిచయం చేసేందుకు రెనో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ఎక్కువగా డాసియా బ్యాడ్జ్ క్రింద్ విక్రయిస్తున్న 'లాజీ' (Lodgy) ఎమ్‌పివిని భారత విపణిలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. రెనో ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ (పల్స్), ప్రీమియం సెడాన్ (ఫ్లూయెన్స్), ఎంట్రీ సెవల్ సెడాన్ (స్కాలా), ప్రీమియం ఎస్‌యూవీ (కొలియోస్), కాంపాక్ట్ ఎస్‌యూవీ (డస్టర్)లను విక్రయిస్తోంది.

రెనో ఇండియా త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్న ఈ లాజీ ఎమ్‌పివి గురించి కొన్ని వాస్తవాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రెనో లాజీ

రెనో లాజీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి. ఇది 2014 చివరి నాటికి దేశీయ విపణిలో విడుదల కావచ్చని అంచనా. దేశీయ విపణిలో దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు మధ్యలో ఉండొచ్చని అంచనా.

రెనో లాజీ

చెన్నైకి సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో లాజీ ఎమ్‌పివిని తయారు చేయనున్నారు. ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మోడల్‌లో మార్పులు చేయనున్నారు. ఈ మార్పులను భారత్‌‍లోని రెనో ఆర్ అండ్ డి చేపట్టనుంది.

రెనో లాజీ

ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న రెనో లాజీ ఎమ్‌పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇది గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో లాజీ ఎమ్‌పివిలో 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

రెనో లాజీ

గ్లోబల్ మార్కెట్లలో మంచి సక్సెస్ సాధించిన రెనో లాజీ ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి, భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

రెనో లాజీ

ప్రస్తుతం భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, డస్టర్ ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేసి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న రెనో ఇండియా ఎమ్‌పివి విభాగంలో కూడా లాజీ విడుదలతో సక్సెస్‌ను సాధించాలని భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, July 14, 2014, 10:00 [IST]
English summary
French manufacturer wants to join the party with its Lodgy MPV for India. The Lodgy is sold in most markets under the Dacia badge, just as the Duster. Renault's Duster has witnessed success and appreciation in India and the French will have high hopes from its MPV offering.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+