రెనో డస్టర్ సెకండ్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌ను ప్రవేశపెట్టి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, కంపెనీ ఇందులో రెండవ వార్షికోత్సవ (సెకండ్ యానివర్స్‌రే) ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ప్రత్యేక ఎక్స్-షోరూమ్ ధర రూ.8.88 లక్షలకే (జులై 20 వరకు మాత్రమే) విక్రయిస్తున్నారు.
రెనో డస్టర్ సెకండ్ యానివర్స్‌రే ఎడిషన్‌పై కంపెనీ అదనంగా రెండేళ్ల వారంటీని, 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను మరియు ఉచిత గ్యాంగ్స్ ఆఫ్ డస్టర్ మెంబర్‌షిప్‌ను ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ రెనో డస్టర్‌తో పోల్చుకుంటే, ఈ వార్షికోత్సవ ఎడిషన్ రెనో డస్టర్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. దీని విశిష్టతలు ఇలా ఉన్నాయి:

1. కొత్త అమేజాన్ గ్రీన్ కలర్ పెయింట్
2. స్పోర్టీ నియాన్ ఇంటీరియర్స్
3. ఫ్రంట్ బంపర్ విత్ ల్యాంప్స్
4. స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్
5. పవర్‌ఫుల్ 1.5 లీటర్ డిసిఐ ఇంజన్
6. 20.45 కెఎమ్‌పిఎల్ మైలేజ్
7. 205 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్
8. 215/65 ఆర్16 టైర్స్


Click it and Unblock the Notifications








