భారత్‌లో 2014లో విడుదల కానున్న రెనో లాడ్జీ ఎమ్‌పివి

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ఎమ్‌పివిని తీసుకురానున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, దేశీయ విపణిలో రెనో ఇండియాకు ఎమ్‌పివి సెగ్మెంట్లో ఎలాంటి ఉత్పత్తి లేదు. అయితే, ఇదే సమయంలో తమ జపనీస్ భాగస్వామి నిస్సాన్ మాత్రం ఇవాలియా అనే ఎమ్‌పివిని ఆఫర్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో, రెనో ఇండియా కూడా ఓ ఎమ్‌పివిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే, గ్లోబల్ మార్కెట్లలో రెనో అందిస్తునన్న రెనో లాడ్జీ (Renault Lodgy)ఎమ్‌పివిని భారత విపణిలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇటీవలే రెనో ఉక్రైన్ మార్కెట్లో ఈ ఎమ్‌పివిని విడుదల చేసింది. ఇదే వెర్షన్ ఇండియాకు కూడా రానున్నట్లు సమాచారం.

రెనో ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ (పల్స్), ప్రీమియం సెడాన్ (ఫ్లూయెన్స్), ఎంట్రీ సెవల్ సెడాన్ (స్కాలా), ప్రీమియం ఎస్‌యూవీ (కొలియోస్), కాంపాక్ట్ ఎస్‌యూవీ (డస్టర్)లను విక్రయిస్తోంది. రెనో ఇండియా త్వరలోనే ఈ ఎమ్‌పివి (లాడ్జీ) గురించి కొన్న వాస్తవాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

రెనో లాడ్జీ గురించి కొన్ని వాస్తవాలు:

రెనో లాడ్జీ గురించి కొన్ని వాస్తవాలు:

రెనో లాడ్జీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి.

2014 మధ్య భాగంలో దేశీయ విపణిలో విడుదల కావచ్చని అంచనా.

అంచనా ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు మధ్యలో.

2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల కావచ్చు.

ఇంజన్

ఇంజన్

ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న రెనో లాడ్జీ ఎమ్‌పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇది గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో లాడ్జీ ఎమ్‌పివిలో 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ఇండియాలో రెనో లాడ్జీ కాంపిటీషన్

ఇండియాలో రెనో లాడ్జీ కాంపిటీషన్

గ్లోబల్ మార్కెట్లలో మంచి సక్సెస్ సాధించిన రెనో లాడ్జీ ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి, భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

రెనో లాడ్జీ ఎమ్‌పివి

ప్రస్తుతం భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, డస్టర్ ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేసి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న రెనో ఇండియా ఎమ్‌పివి విభాగంలో కూడా లాడ్జీ విడుదలతో సక్సెస్‌ను సాధించాలని భావిస్తోంది. రెనో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్రాండ్‌తో లాడ్జీ ఎమ్‌పివిని విక్రయిస్తోంది.

రెనో లాడ్జీ ఎమ్‌పివి

రెనో లాడ్జీ ఎమ్‌పివికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2013, 11:25 [IST]
English summary
Renault is currently wooing Indian customers by its Duster SUV. However, the company is keeping a close eye on Maruti's recent development and its success with the Ertiga. Renault is looking to bring another product from the Dacia stable to India. The Dacia sourced MPV Lodgy is expected to make its inroads into India by mid-2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+