రెనో స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్ మళ్లీ వచ్చేసిందోచ్..
ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న రెనో స్కాలా సెడాన్‌లో కంపెనీ గడచిన ఏప్రిల్ నెలలో 'స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్' (Scala Travelogue Edition) పేరిట అదనపు ఫీచర్లు జోడించిన ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.
అయితే, అప్పట్లో రెనో ఇండియా కేవలం టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ స్కాలాలో (రూ.9.78 లక్షల ధరతో) మాత్రమే ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆఫర్ చేసింది. కాగా.. తాజాగా రెనో తమ స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్‌ను అన్ని వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. రెనో స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్ ధరలు రూ.8.48 లక్షల నుంచి రూ.10.20 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రెనో స్కాలా ట్రావెలాగ్ లిమిటెడ్ ఎడిషన్‌లో లభించే ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

రెనో స్కాలా ట్రావెలాగ్ లిమిటెడ్ ఎడిషన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ధర శ్రేణిలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌తో లభ్యం కానున్న ఏకైక సెడాన్ స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్ మాత్రమే.

కారు ఇంటీరియర్‌కు మరింత అందాన్నిచ్చే ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్.

సంగీత ప్రియుల కోసం ఇందులో అమర్చిన డివిడి ప్లేయర్, బ్లూటూత్, యూఎస్‌బి, ఐపాడ్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

డ్రైవర్ కంఫర్ట్ కోసం స్టీరింగ్ వీల్‌పై జోడించిన ఆడియో కంట్రోల్స్

వెనుక సీట్లో కూర్చునే ప్రయాణీకులపై ఎండ పడకుండా ఉండేలా ఏర్పాటు చేసిన రియర్ సన్ షేడ్.

కారుకు సేఫ్టీ మరియు స్టయిల్‌నిచ్చే కొత్త సైడ్ మిర్రర్స్ (సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లతో).

కారును సురక్షితంగా రివర్స్ చేసేందుకు మరియు రివర్స్ పార్కింగ్ సులభతరం చేసేందుకు కారు వెనుక భాగంలో అమర్చిన రివర్స్ పార్కింగ్ కెమెరా

కారుకు మరింత ప్రీమియం లుక్‌నిచ్చేందుకు వెనుక వైపు సైలెన్సర్‌కు జోడించిన రియర్ మఫ్లర్ కట్టర్ (సైలెన్సర్ కవర్)

రెనో స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్ ఈ అదనపు ఫీచర్లతో పాటుగా 7999 ఈఎమ్ఐ స్కీమ్, 2 ఏళ్ల వారంటీ మరియు 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో లభ్యం కానుంది.

కొత్త రెనో స్కాలా ట్రావెలాగ్ ఎడిషన్‌లో ఇంజన్స్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. వీటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
RXL Petrol: INR 8.48 lakh
RXL CVT Petrol: INR 9.61 lakh
RXZ CVT Petrol: INR 10.51 lakh
RXL Diesel: INR 9.31 lakh
RXZ Diesel: INR 10.20 lakh
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








