రోల్స్ రాయిస్ ఘోస్ట్ చెంగ్డు గోల్డెన్ సన్ బర్డ్ ఎడిషన్
రోల్స్ రాయిస్ అంటేనే కార్లలో కెల్లా గోల్డెన్ కారు. అలాంటి గోల్డెన్ కారుకు గోల్డెన్ కోటింగ్ వేస్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోతుంది కదూ..! ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఓ కారు గురించే. బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ అందిస్తున్న ఘోస్ట్ కారులో ఓ కొత్త వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.
ప్రస్తుతం ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో సెలెస్టియల్ ఫాంటమ్‌ను ప్రదర్శించిన రోల్స్ రాయిస్, తాజాగా ఘోస్ట్ గోల్డెన్ సన్ బర్డ్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు అఫీషియల్ పేరు రోల్స్ రాయిస్ చెంగ్డు గోల్డెన్ సన్ బర్డ్ (Rolls Royce Ghost Chengdu Golden Sunbird).
రోల్స్ రాయిస్ మొదటి నుంచే కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా కార్లను కస్టమైజ్ చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఆవిష్కరించిన ఘోస్ట్ చెంగ్డు గోల్డెన్ సన్ బర్డ్ వేరియంట్‌ను అలా తయారు చేసినదే. మరి ఈ స్పెషల్ కారు ప్రత్యేకతలేంటో పరిశీలిద్దాం రండి..!

గోల్డెన్ సన్ బర్డ్ (సువర్ణ సౌర పక్షి) థీమ్‌తో ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్‌ను రూపొందించారు. ఇదొక పురాతన చైనీస్ కళాఖండం, దీనిని చెంగ్డు నగరంలో 2001లో గుర్తించారు.

ఈ కళాఖండాన్ని పూర్తిగా స్వచ్ఛమైనం బంగారంతో తయారు చేశారు. ఇది వృత్తాకారంలో (ఫొటోలో చూడండి) ఉంటుంది. ఇందులో సూర్యుడు, సూర్యూని చుట్టూ అపసవ్య దిశలో (యాంటీ-క్లాక్‌వైస్ డైరెక్షన్) ఎగిరే సన్ బర్డ్స్ (పక్షులు) ఉంటాయి. వాస్తవానికి ఈ కళాఖండం 12.5 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉండి, 20 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

రోల్స్ రాయిస్ తమ ఘోస్ట్ గోల్డెన్ సన్ బర్డ్ డిజైన్‌ను ఈ కళాఖండం ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఈ కారు ఎక్స్టీరియర్‌ను గమనిస్తే, మధ్య భాగంలో పూర్తిగా బంగారు వర్ణంతో పెయింట్ చేయబడి ఉంటుంది. బానెట్ నుంచి బూట్ వరకు, గ్రిల్ చుట్టూ కూడా ఈ గోల్డెన్ పెయింట్ ఉంటుంది. అయితే, ఇది గోల్డ్ పెయింట్ మాత్రమేనా లేకా స్వచ్ఛమైన బంగారమా అనేది మాత్రం తెలియరాలేదు. చక్రాలపై గోల్డ్ రింగ్స్, బాడీపై పక్క భాగాల్లో కనిపించే గోల్డెన్ లైన్స్, లైన్స్ మధ్యలో అక్కడక్కడా కనిపించే సన్ బర్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇదిగో ఈ ఫొటోలో బాడీ లైన్స్ మధ్యలో డిజైన్ చేసిన సన్ బర్డ్ (సౌర పక్షి)ని దగ్గరగా చూడండి.

ఈ కారులోని డోర్ సిల్ ప్లేట్స్‌పై చెంగ్డు గోల్డెన్ సన్ బర్డ్ అనే స్పెషల్ బ్యాడ్జ్ ఉంటుంది. ఈ కారును పూర్తిగా చేతుల్తో తయారు చేశారు.

ఇక ఈ కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే, వీటిని మరింత విలాసవంతంగా తీర్చిదిద్దారు. లైట్ బ్రౌన్ కలర్‌లో ఉండే రిచ్ లెథర్, హెడ్‌రెస్ట్ లపై గోల్డ్ కలర్‌లో ఉండే గోల్డెన్ సన్ బర్డ్ లోగో లను చూడొచ్చు.

ఈ స్పెషల్ కారు డ్యాష్‌బోర్డుపై కూడా గోల్డెన్ సన్ బర్డ్ లోగో కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా, భారతదేశం కోసం కూడా ఇలాంటి ఓ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కారును రూపొందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








