నవంబర్ 7వ తేదీన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 విడుదల
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఘోస్ట్ కారులో కంపెనీ అప్‌డేటెట్ వెర్షన్‌ను ఈనెల 7వ తేదీన విడుదల చేయనుంది. రోల్స్ రాయిస్ తొలిసారిగా 2014 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన తమ ఘోస్ట్ సిరీస్ 2 మోడల్‌ను నవంబర్ 7, 2014వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది.
రోల్స్ రాయిస్ ఇండియాకు, దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ కూడా ఘోస్ట్ కావటం విశేషం. అప్‌డేటెడ్ స్టయిలింగ్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ మరియు మోడ్రన్ టెక్నాలజీతో ఈ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్2 మోడల్‌ను తయారు చేశారు. ఈ మోడల్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలై మంచి సక్సెస్‌ని సాధించింది.

రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, బంపర్స్‌తో ఇది ముందు వైపు సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి పవర్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు హెడ్‌లైట్స్ చుట్టూ గుండ్రంగా ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ లేవు.
రోల్స్ రాయిస్ కార్ల బానెట్‌పై ఉండే లెజండ్రీ 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' బానెట్ మస్కట్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. ఇది ఈ ఏడాది 103వ జన్మదినాన్ని జరుపుకోనుంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. అత్యంత విలాసవంతంగా మరియు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. కస్టమర్ల ఎంపిక మేరకు అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను రోల్స్ రాయిస్ అందుబాటులో ఉంచనుంది.

స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లు ఎలాంటి అనుభూతి పొందుతారో, ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కూడా అదే రకమైన అనుభూతిని పొందుతారని రోల్స్ రాయిస్ పేర్కొంది.
ఇంజన్ విషయానికి వస్తే.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 కారులో 6.0 లీటర్, ట్విన్ టర్బో వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను సరికొత్త 8-స్పీడ్ జెడ్ఎఫ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేశారు. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 స్టాండర్డ్ 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో కానీ లేదా ఆప్షనల్ 21 ఇంచ్ ఫోర్జ్ వీల్స్‌తో కానీ అందుబాటులో ఉండుది. దేశీయ విపణిలో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ.3.40 కోట్ల నుంచి రూ.4.30 కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








