ఆటో ఎక్స్‌పో 2014: బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన తమ మొట్టమొదటి హైబ్రిడ్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8' (BMW i8) ఇప్పుడు భారత్‌కు కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ స్టన్నింగ్ బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును ఆవిష్కరించారు. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ హైటెక్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీతో తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును తయారు చేశారు.
బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో ఓ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు.

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ఉపయోగిస్తుంది. ఐ8లో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే (బహుశా 7 లేదా 8 యూనిట్లు) లభ్యం కానుంది.మయ్యే ఆస్కారం ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, దీని ధరకు అంచనాలకు మించి ఉండొచ్చని (సుమారు రూ.1.5 కోట్లు) తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








