మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్‌పై రూ.65,000 వరకూ డిస్కౌంట్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, గడచిన జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ 'రిట్జ్ ఎలేట్' (Ritz Elate)పై కంపెనీ ఇప్పుడు భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఇప్పుడు, ఈ కారుపై రూ.65,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.

గత కొంత కాలంగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, కార్ కంపెనీలు అమ్మకాలను పెంచుకునేందుకు స్పెషల్/లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టారు. అయితే, వీటి వలన కూడా అమ్మకాలు జోరందుకోకపోవటంతో, అధనపు ఫీచర్లు, అధిక ధర కలిగిన ఈ స్పెషల్/లిమిటెడ్ ఎడిషన్లపై కూడా కార్ మేకర్లు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు.

ఈ కోవలోనే మారుతి సుజుకి కూడా తమ రిట్జ్ ఎలేట్ స్పెషల్ ఎడిషన్‌పై తగ్గింపును అందిస్తోంది. ఇందులో పలు అదనపు ఫీచర్లతో పాటుగా, కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో లభ్యమవుతోంది.

ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి రిట్జ్ ఎలేట్ మోడల్‌లో లభ్యమయ్యే ఫీచర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ మోడల్ సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

ఇందులో ఆరెంజ్ కలర్ యాంబీంట్ ఇంటీరియర్ లైటింగ్ మరియు ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్‌తో కూడిన సీట్ కవర్స్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ ఇంటీరియల్ లుక్ ఫీల్‌లో మార్పును తెస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

సంగీత ప్రియుల కోసం రిట్జ్ ఎలేట్‌లో జెవిసి 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్ (స్పీకర్లతో పాటుగా)ను ఆఫర్ చేస్తున్నారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

డ్రైవర్ కోసం రిట్జ్ ఎలేట్ బ్రాండింగ్‌తో కూడిన నెక్ కుషనింగ్, బ్యాక్‌రెస్ట్ కోసం పిల్లోను ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

కారును సురక్షితంగా రివర్స్ చేసేందుకు గాను ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌ను అందిస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

వైర్‌లెస్‌గా ఫోన్ కాల్స్ చేసేందుకు గాను బ్లావ్‌పంక్ట్ బ్లూటూత్ కిట్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

రిట్జ్ బ్రాండెడ్ ఫ్లోర్‌మ్యాట్స్ ఇందులో మరో ప్రత్యేకత.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్ కవర్, ఓ మల్టీ పర్పస్ బ్యాగ్‌ను కూడా మారుతి సుజుకి ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

వర్షాకాలం కోసం బ్లాక్ డోర్ విజర్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్

ధృడమైన మడ్ ఫ్లాప్స్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్ కూడా రిట్జ్ ఎలేట్‌లో లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 15, 2014, 12:49 [IST]
English summary
Maruti Suzuki recently introduced the limited edition of its Ritz hatchback named as Ritz Elate. Now, the company is offering a saving of Rs 65,000 on this limited edition Ritz.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+