మెర్సిడెస్, కార్జాన్‌రెంట్ నుంచి సెల్ఫ్ డ్రైవ్ లగ్జరీ కార్ సేవలు
ఇప్పటి వరకు కొన్ని కార్ క్యాబ్ కంపెనీలు సాధారణ ప్యాసింజర్ కార్లను సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయంగా నడుపుకునేందు) కోసం అద్దెకు ఇస్తున్న సంగతి తెలిసినదే. అయితే, తాజాగా సాధారణ కార్లే కాకుండా లగ్జరీ కార్లను కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు ఇస్తామని ముందుకొచ్చింది ప్రముఖ కార్ రెంటల్ సర్వీస్ ప్రొవైడర్ కార్జ్ ఆన్ రెంట్.
ఈ మేరకు కార్జ్ ఆన్ రెంట్, మెర్సిడెస్ బెంజ్ సంస్థలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గంటకు రూ.900 (సి-క్లాస్) నుంచి రూ.1200 (ఈ-క్లాస్) అద్దెకు లేదా రోజుకు రూ.6500 (సి-క్లాస్) నుంచి 9500 (ఈ-క్లాస్) అద్దెను చెల్లించి ఈ లగ్జరీ కార్లను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ, ఫ్యామిలీతో పాటుగా లగ్జరీ సవారీని ఆస్వాదించవచ్చని కార్జ్ ఆన్ రెంట్ పేర్కొంది.

కార్జ్ ఆన్ రెంట్ భారతదేశంలోనే తొలిసారిగా 'మైల్స్' (Myles) బ్రాండ్ క్రింద మెర్సిడెస్ బెంజ్‌తో కలిసి సెల్ఫ్ డ్రైవ్ లగ్జరీ కార్ సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో భాగంగా, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఈ-క్లాస్ మోడళ్లను ఈ సేవల కోసం అందుబాటులో ఉంచనున్నారు. భవిష్యత్తులో ఎస్‌ఎల్‌కే, ఏఎమ్‌జి మోడళ్లతోపాటు ఇతర బ్రాండ్లను కూడా పరిచయం చేయనున్నట్టు కార్జ్ ఆన్ రెంట్ తెలిపింది.
ప్రస్తుతానికి ఈ సేవలను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే, భవిష్యత్తులో మరిన్ని నగరాలకు దీనిని విస్తరించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








