నేడు పర్యావరణ దినోత్సవం; ఉచిత పొల్యూషన్ చెకప్

By Ravi

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (ప్రతి ఏటా జూన్ 5వ తేదీని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటారు) పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని కార్ మేకర్ల డీలర్ల ద్వారా 'ఉచిత కాలుష్య తనిఖీ' (ఫ్రీ పొల్యూషన్ చెకప్)ను నిర్వహించాలని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) నిర్ణయించింది.

సియామ్ ఈ మేరకు ఆయా కార్ కంపెనీల డీలర్లతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉదాహరణకు మీరు ఫోర్డ్ కారును ఉపయోగిస్తుంటే, ఈరోజు (05.06.2014) మీ ఫోర్డ్ కారును మీకు సమీపంలోని ఫోర్డ్ అధీకృత డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి ఉచితంగా పొల్యూషన్ చెకప్ చేయించుకొని, పియూసి సర్టిఫికెట్ కూడా పొందవచ్చు.

SIAM

కేవలం ఫోర్డ్ వినియోగదారులే కాకుండా మహీంద్రా, ఫియట్, స్కొడా ఇలా దాదాపు అన్ని కార్ కంపెనీల డీలర్లు నేడు (05.06.2014) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ డీలర్‌షిప్స్, సర్వీస్ సెంటర్ల వద్ద ఈ ఉచిత పియూసి చెకప్ క్యాంప్స్ నిర్వహించనున్నారు. వాహన కాలుష్యం తగ్గించేందుకు సియామ్ ఈ నిర్ణయం తీసుకుంది.

వాహనాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించి వాహన యజమానుల్లో అవగాహనను పెంచడం, తద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించడమే లక్ష్యంగా సియాన్ ఈ ప్రణాళికను విస్తృత స్థాయిలో అమలుపరుస్తోంది. మరి పర్యావరణానికి మీ వంతు కృషిలో భాగంగా, మీరు కూడా మీ కారును ఫ్రీ పియూసి చెకప్‌కు తీసుకువెళ్తున్నారా..?

More from DriveSpark

Article Published On: Thursday, June 5, 2014, 9:24 [IST]
English summary
On account of World Environment Day, the Society of Indian Automobile Manufacturers (SIAM) will be conducting a free PUC check up camp in Mumbai and Bangalore. PUC certificates will be issued free of cost to all participants if their vehicles do indeed pass the emission test.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+