భారత్‌లో 2013 ఆక్టావియా టెస్టింగ్‌ను ప్రారంభించిన స్కొడా
భారత్‌లో సరికొత్త 2013 స్కొడా ఆక్టావియా విడుదల ఖరారైనట్లు తెలుస్తోంది. గడచిన మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ తమ ప్రొడక్షన్ వెర్షన్ ఆక్టావియాను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, స్కొడా ఇండియా ఇప్పటికే 2013 ఆక్టావియాను భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహించటం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుంది.
బెంగుళూరు రోడ్లపై కొత్త ఆక్టావియా టెస్ట్ చేస్తుండగా యూట్యూబ్ యూజర్ ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. సుధీర్ఘ కాలంగా ఉత్పత్తిలో ఉన్న లారా సెడాన్‌ను ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలెస్లావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయటాన్ని స్కొడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో లభిస్తున్న లారా సెడాన్‌ను కూడా రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ కొత్త కారును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా
స్కొడా ఇండియా, 2013 ఆక్టావియా సెడాన్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనుంది. అత్యుత్తమ ఇంటీరియర్స్, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్స్, అధునాత టెక్నాలజీ మరియు ఆకట్టుకునే మైలేజ్ వంటి సదుపాయాలతో స్కొడా తమ సరికొత్త 2013 ఆక్టావియా రూపొందించింది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉండనుంది. గ్లోబల్ మార్కెట్లలో 2013 స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
ఎంట్రీ-లెవల్ స్కొడా ఆక్టావియాలో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.4 లీటర్ ఇంజన్ అలాగే 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. కొత్త అక్టావియా వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల తర్వాత ఇది 2.0 లీటర్ టర్బో ఇంజన్‌తో కూడా ఇది లభించే ఆస్కారం ఉంది.
డీజిల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, 103 బిహెచ్‌పి 1.6 లీటర్ ఇంజన్, 108 బిహెచ్‌పి గ్రీన్‌లైన్ వెర్షన్, 147 బిహెచ్‌పి 1.6 లీటర్ మరియు 181 బిహెచ్‌పి 2.0 లీటర్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది. కొత్త ఆక్టావియా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఫైవ్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో లభ్యం కానుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








