2015లో స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ రీలాంచ్!?
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో ఇండియా, దేశీయ విపణిలో ఇదివరకు విక్రయిస్తూ, ఇప్పుడు నిలిపివేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్కొడా ఫ్యాబియాను తిరిగి పునఃప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. స్కొడా ఈ ఏడాది ద్వితీయార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో సరికొత్త ఫ్యాబియాను ప్రవేశపెట్టనుంది.
ఈ నేపథ్యంలో, స్కొడా తమ సరికొత్త 2014 ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి, ఇండియాలో విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త 2015 ఫ్యాబియాను తయారు చేయనున్నట్లు సమాచారం.

అయితే, ఈ కొత్త ఫ్యాబియా ఇండియాకు రావటానికి దాదాపు మరో ఏడాదికి పైగా సమయం పట్టే ఆస్కారం ఉంది. కొత్త ఫ్యాబియాను రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మోడ్రన్ డిజైన్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. అలాగే, వెనుక వైపు డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి.
కొత్త ఫ్యాబియా ఫోక్స్‌వ్యాగన్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనున్న నేపథ్యంలో, ఇది మునుపటి జనరేషన్ కన్నా పొడవుగా, వెడల్పుగా ఉండొచ్చని అంచనా. ఇదే గనుక జరిగితే, కొత్త 2015 స్కొడా ఫ్యాబియాలో మరింత విశాలమైనల లెగ్‌రూమ్, బూట్ స్పేస్ లభించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో స్కొడా ఫ్యాబియా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇప్పటికే మిగిలిన ఉన్న ఫ్యాబియా స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త 2015 ఫ్యాబియాలో 1.0 లీటర, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. అలాగే ఇందులో మరింత శక్తివంతమైన 1.4 లీటర్, టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ ఇంజన్ కూడా అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








