లిమిటెడ్ ఎడిషన్ ర్యాపిడ్ లీజర్‌ను విడుదల చేసిన స్కొడా
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో, అమ్మకాలును పెంచుకునేందుకు కార్ల తయారీ సంస్థలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే, ప్రస్తుతం అందిస్తున్న మోడళ్లను అధనపు ఫీచర్లు జోడించి లిమిటెడ్ ఎడిషన్లుగా మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అనేక లిమిటెడ్ ఎడిషన్‌లు మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసినదే.
తాజాగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా ఇండియా ఓ లిమిటెడ్ ఎడిషన్ ర్యాపిడ్ సెడాన్‌ను విడుదల చేసింది. స్కొడా ర్యాపిడ్ లీజర్ (Skoda Rapid Leisure) పేరుతో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో ఉండగా, డీజిల్ వెర్షన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ అందుబాటులో ఉంది. స్కొడా ర్యాపిడ్ లీజర్ ధరలు ఇలా ఉన్నాయి:
- 1.6 ఎమ్‌పిఐ (పెట్రోల్) మ్యాన్యువల్ - రూ.7,79,352
- 1.6 ఎమ్‌పిఐ (పెట్రోల్) ఆటోమేటిక్ - రూ.8,79,625
- 1.6 టిడిఐ (డీజిల్) మ్యాన్యువల్ - రూ.9,06,926
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
పోర్టబల్ స్క్రాన్ నావిగేషన్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డోర్ సిల్స్, లెథర్ సీట్ కవర్స్ వంటి అధనపు ఫీచర్లు కూడా స్కొడా ర్యాపిడ్ లీజర్‌లో లభ్యంకానున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌ను గుర్తు చేస్తూ ఇది స్పెషల్ బ్యాడ్జింగ్‌తో లభ్యం కానుంది. స్కొడా ర్యాపిడ్ లీజర్ సెడాన్ ధర రూ.9.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.



Click it and Unblock the Notifications








